త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న నాయ‌గ‌ణ్ సినిమా మొత్తం లీక్‌.. సోష‌ల్ మీడియాలో విజ‌య్ చివ‌రి మూవీ!

Jana Nayagan | తమిళనాడు ఎన్నికల వేళ‌ టీవీకే పార్టీ అధినేత‌, దళపతి విజయ్‌కి (vijay) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. సెన్సార్ (censor clearance) చిక్కుల‌తో విడుద‌ల వాయిదా ప‌డిన ఆయ‌న చివ‌రి సినిమా `జన నాయగణ్` (Jana Nayagan) సినిమా మొత్తం లీక్ అయిన‌ట్లు తెలుస్తున్న‌ది.

G

Entertainment | Published On Apr 10, 2026, 6.04 am IST

Jana Nayagan | జ‌న నాయ‌గ‌ణ్ సినిమా మొత్తం లీక్‌.. సోష‌ల్ మీడియాలో విజ‌య్ చివ‌రి మూవీ!
Advertisement

Jana Nayagan | త్రినేత్ర‌.న్యూస్‌: తమిళనాడు ఎన్నికల వేళ‌ టీవీకే పార్టీ అధినేత‌, దళపతి విజయ్‌కి (vijay) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. సెన్సార్ (censor clearance) చిక్కుల‌తో విడుద‌ల వాయిదా ప‌డిన ఆయ‌న చివ‌రి సినిమా `జన నాయగణ్` (Jana Nayagan) సినిమా మొత్తం లీక్ అయిన‌ట్లు తెలుస్తున్న‌ది. మొద‌ట‌ 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నప్ప‌టికీ.. మొత్తం మూవీ అదీ హెడీ ప్రింట్ సోషల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్న‌ది. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది.

విజ‌య్ టీవీకే పార్టీ స్థాపించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్‌యంలో `జన నాయగణ్` త‌న చివరి సినిమా అని ప్రకటించారుకూడా. తెలుగులో సూప‌ర్ హిట్ అయిన `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా దీన్ని తెర‌కెక్కించారు. అయితే పూర్తిగా ఈ మూవీని తీసుకోకుండా సెకండ్ హాఫ్‌ని ఇంట‌ర్నేష‌న‌ల్‌ క్రైమ్ ఎలిమెంట్స్‌తో మార్చేశారు. దానికి సైన్యం నేప‌థ్య స‌న్నివేశాల‌ని జోడించ‌డంతో సినిమా చుట్టూ వివాదం మొద‌లైంది. షెడ్యూల్ ప్ర‌కారం జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. కోర్టు కేసులు, సెన్సార్ బోర్డు అభ్యంత‌రాలతో రివైజింగ్ క‌మిటీ త‌లుపుత‌ట్టిన ఈ మూవీ టీమ్ సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ది.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఆ త‌ర్వాత విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇంతలోనే సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 3 గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement