త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha vs Tamilnadu BJP Chief | సారీ త్రిష.. తమిళనాడు బీజేపీ చీఫ్ క్షమాపణ

ఆ స్టేట్‌మెంట్ పొరపాటున వచ్చింది. ఈ విషయం గురించి ఆల్ ఇండియా ఉమెన్స్ వింగ్ చీఫ్ వనతి శ్రీనివాసన్, అన్నామలై నాతో మాట్లాడారు. నా స్టేట్‌మెంట్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, బాధపడి ఉంటే వారికి నేను క్షమాపణ చెబుతున్నాను

J

Entertainment | Published On Feb 16, 2026, 4.21 pm IST

Trisha vs Tamilnadu BJP Chief | సారీ త్రిష.. తమిళనాడు బీజేపీ చీఫ్ క్షమాపణ
Advertisement

Trisha vs Tamilnadu BJP Chief | ఇటీవల తమిళనాడు రాజకీయాలు సినిమా రంగు పూసుకున్న విషయం తెలిసిందే. టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే, క్షేత్రస్థాయి రాజకీయాలు అర్థం కావాలంటే ముందు విజయ్ త్రిష ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటూ నైనర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపాయి. ఈ వివాదంపై త్రిష కూడా స్పందించింది. తన లాయర్ ద్వారా ప్రకటనను రిలీజ్ చేసింది. తన సోషల్ మీడియాలోనూ లెటర్‌ను షేర్ చేసింది. త్రిష గురించి మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రచారంలో ఉన్నాయని, అవన్నీ అవాస్తవాలేనని త్రిష తరుపు లాయర్ నిత్యేష్ నటరాజ్ అందులో ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా విజయ్, త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలను నైనర్ నాగేంద్రన్ వెనక్కి తీసుకున్నారు. కావాలని తాను అలా అనలేదని, పొరపాటున అలా అనాల్సి వచ్చిందని నాగేంద్రన్ క్లారిటీ ఇచ్చారు.

"ఆ స్టేట్‌మెంట్ పొరపాటున వచ్చింది. ఈ విషయం గురించి ఆల్ ఇండియా ఉమెన్స్ వింగ్ చీఫ్ వనతి శ్రీనివాసన్, అన్నామలై నాతో మాట్లాడారు. నా స్టేట్‌మెంట్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, బాధపడి ఉంటే వారికి నేను క్షమాపణ చెబుతున్నాను.." అంటూ నాగేంద్రన్ చెప్పారు.

Advertisement
Advertisement