Sudigali Sudheer | సుడిగాలి సుధీర్ ఈజ్ బ్యాక్ – సర్కార్ సీజన్ 6 లాంఛ్ డేట్ కన్ఫామ్
సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సర్కార్ ఓటీటీ షోకు సీజన్ 6 రాబోతుంది. ఆరో సీజన్ లాంఛింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ శుక్రవారం రివీల్ చేసింది.
Entertainment | Published On Feb 20, 2026, 8.26 pm IST
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఫన్ గేమ్ షో సర్కార్‌కు సీజన్ 6 రాబోతుంది. ఈ కొత్త సీజన్ లాంఛింగ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆహా ఓటీటీ సర్కార్ పేరుతో ఈ గేమ్ షోను లాంఛ్ చేసింది. సర్కార్ షోలో ఇప్పటివరకు ఐదు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి. తాజాగా ఆరో సీజన్‌ను మొదలుపెట్టబోతున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది.
ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్...
ఫిబ్రవరి 27 నుంచి సర్కార్ సీజన్ 6 మొదలుకాబోతున్నట్లు ప్రకటించింది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌ను రిలీజ్ చేస్తామని వెల్లడింది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ది ఓజీ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. ఈ పోస్టర్‌లో స్టైలిష్ లుక్‌లో సుధీర్ కనిపిస్తున్నాడు. అతడిపై డబ్బుల వర్షం కురుస్తున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
నలుగురు గెస్ట్‌లు...
సర్కార్ గేమ్ షోలో ప్రతి ఎపిసోడ్‌కు నలుగురు గెస్ట్‌లు వస్తారు. వారి ఐక్యూను టెస్ట్ చేస్తూ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సెలిబ్రిటీలపై సుధీర్ వేసే పంచ్‌లు, వారు చేసే కామెడీతో సరదాగా సర్కార్ గేమ్ షో సాగుతుంటుంది. సినిమా, టీవీ సెలిబ్రిటీలు ఈ గేమ్ షోకు గెస్ట్‌లుగా వస్తుంటారు.
రెమ్యూనరేషన్ పెంచేశాడు...
సీజన్ 6లో కొత్తగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరింత ఫన్‌తో పాటు ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారట. కాగా సర్కార్ సీజన్ 6 కోసం సుడిగాలి సుధీర్ తన రెమ్యూనరేషన్‌ను పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. సర్కార్ సీజన్ 5 వరకు ఒక్కో ఎపిసోడ్‌కు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చాడు సుధీర్. సర్కార్ సీజన్ 6 కోసం ఒక్కో ఎపిసోడ్‌కు ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం క్రైమ్ కామెడీ మూవీ – టీవీ దొంగతనంలో ట్విస్ట్‌లు
మే 7, 2026

Varun Sandesh | నా వైఫ్ మిస్సింగ్ అంటోన్న టాలీవుడ్ హీరో – ఏంటా మిస్టరీ?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



