త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salim Khan | స‌ల్మాన్ ఖాన్ తండ్రి స‌లీమ్ ఖాన్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

Salim Khan | బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, దిగ్గ‌జ సినీ రచయిత సలీమ్‌ ఖాన్ (Salim Khan) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

D

Entertainment | Published On Feb 17, 2026, 1.52 pm IST

Salim Khan | స‌ల్మాన్ ఖాన్ తండ్రి స‌లీమ్ ఖాన్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌
Advertisement

Salim Khan | బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, దిగ్గ‌జ సినీ రచయిత సలీమ్‌ ఖాన్ (Salim Khan) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న్ని కుటుంబ స‌భ్యులు వెంట‌నే ముంబై (Mumbai)లోని లీలావ‌తి ఆసుప‌త్రికి (Lilavati Hospital) తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం స‌లీమ్‌ ఖాన్ వ‌య‌సు 90 ఏళ్లు. ఈ విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్నారు. స‌లీమ్ ఖాన్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిసింది. షూటింగ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు విషయం తెలియగానే తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.

స‌లీమ్ ఖాన్ అస‌లు పేరు.. సలీం అబ్దుల్ రషీద్ ఖాన్. 1935, న‌వంబ‌ర్ 24న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. ఆయ‌న స్క్రీన్ రైటర్, నటుడు, చిత్ర నిర్మాత. బాలీవుడ్‌కు ఎన్నో హిట్ చిత్రాల‌ను అందించారు. మ‌రో బాలీవుడ్ ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్‌తో క‌లిసి 'సలీమ్-జావేద్' పేరుతో అనేక ఐకానిక్ చిత్రాలకు కథలు రాశారు. వీరి కలయికలో షోలే, జంజీర్, దీవార్, డాన్, త్రిశూల్‌ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. స‌లీమ్ ఖాన్ ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలుసుకున్న అభిమానులు, ప‌లువురు బీటౌన్ సెల‌బ్రిటీలు.. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement
Advertisement