త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు నోటీసులు..

Allu Arjun | సంధ్య థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా పేర్కొన్న విష‌యం తెలిసిందే.

P

Entertainment | Published On Jun 19, 2026, 7.52 pm IST

Allu Arjun | సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు నోటీసులు..
Advertisement

Allu Arjun | సంధ్య థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో 23 మందిని పోలీసులు నిందితులుగా చేర్చ‌గా.. ఇప్పటివరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు 19 మందికి సమన్లు జారీ చేసింది.

థియేట‌ర్ యాజ‌మాన్యంలోని ప‌ది మందిని నిందితులుగా పేర్కొనగా.. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ బౌన్సర్లలో ఎనిమిది మందిని కూడా చేర్చారు. నిందిదితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన తర్వాతే కేసు విచారణ మొద‌ల‌వుతుంద‌ని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా.. 2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా సంధ్య థియేటర్‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో పెద్ద ఎత్తున అభిమానులు రావ‌డంతో ఒక్క‌సారిగా ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. ఈ క్ర‌మంలోనే తొక్కిస‌లాట జ‌రిగింది. రేవ‌తి అనే మ‌హిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్‌, ఆయ‌న బృందం అభియోగాలు మోపారు.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను 2024 డిసెంబర్ 13న పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అదే రోజు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనంతరం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో భాగంగా డిసెంబర్ 24న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్‌ను పోలీసులు మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు డిసెంబర్‌లోనే వెల్లడించారు.

Advertisement
Advertisement