త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu | మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే లుక్‌లో రుద్ర‌..

Mahesh Babu | సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్ బాబు (Mahesh Babu) హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (SS Rajamouli)  పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో వార‌ణాసి (Varanasi) మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ ఈ సినిమాలో మ‌హేశ్‌.. రుద్ర‌, శ్రీరాముడిగా డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

G

Entertainment | Published On Aug 9, 2026, 8.50 am IST

Mahesh Babu | మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే లుక్‌లో రుద్ర‌..
Advertisement

Mahesh Babu | త్రినేత్ర‌.న్యూస్‌: సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్ బాబు (Mahesh Babu) హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (SS Rajamouli)  పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో వార‌ణాసి (Varanasi) మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ ఈ సినిమాలో మ‌హేశ్‌.. రుద్ర‌, శ్రీరాముడిగా డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌పంచంతోపాటు కాలాన్ని చుట్టేసే సాహ‌సికుడి క‌థ‌గా ఈ మూవీ రూపొందుతున్నది. కేఎల్ నారాయ‌ణ‌, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027, ఏప్రిల్ 7న దాదాపు 120 దేశాల్లో విడుద‌ల కానుంది.

కాగా, ఆగ‌స్టు 9.. ప్రిన్స్‌ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు కావ‌డంతో ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. రుద్ర‌ని (Rudra) ప‌రిచ‌యం చేస్తూ రాజ‌మౌళి పోస్టు చేశారు. `రౌద్రం ఒక్క‌టే అత‌డి స్వ‌భావం కాదు` అనే క్యాప్ష‌న్ పెట్టారు. ఒత్తైన జుట్టు, గ‌డ్డం మీసాల‌తో పూర్తి మాస్, ర‌గ్గ‌డ్ అడ్వెంట‌ర్ లుక్‌లో ఆ ఫొటోల్లో మ‌హేశ్ క‌నిపిస్తున్నారు. ఇక చిత్ర నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ కూడా మ‌హేశ్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది. `మ‌హేశ్ బాబుకు హుద‌య‌పూర్వ‌క పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. మీరు ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డ పంచే ప్రేమ‌, నింపే అప‌రిమిత‌మైన శ‌క్తి, అభిమానుల‌కు మీరిచ్చే ఉత్సాహం.. అన్ని గొప్ప విష‌యాలే. వార‌ణాసి అద్భుతాల‌కు స్వాగ‌తం` అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల‌పాటు సాగే రామాయ‌ణం ఎపిసోడ్‌లో రాముడిగా (Sri Ramudu) మ‌హేశ్ అద్భుతంగా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. తెర‌పై క‌నిపించే ఈ 20 నిమిషాల ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ‌కు దాదాపు 60 రోజులు ప‌ట్టింది.

 

టాలీవుడ్ ప్రిన్స్‌..

టాలీవుడ్‌లో ప్రిన్స్‌గా, సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేశ్‌.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) వారసుడిగా 1979లో `నీడ` సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత తండ్రి, సోద‌రుడితో క‌లిసి కొన్ని సినిమాల్లో బాల నటుడిగా చేసి త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో విడుదలైన రాజకుమారుడు (Rajakumarudu) సినిమాతో హీరోగా రీఎంటీ ఇచ్చారు. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ వంటి సూప‌ర్ హిట్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద‌ త‌న‌కు తిరుగులేద‌ని నిరుపించుకున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి క్లాస్ హిట్స్‌లో ఫ్యామిలీ ప్రేక్ష‌కులకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.

Advertisement
Advertisement