Jana Nayagan | దళపతి విజయ్‌కి మరో షాక్.. కేబుల్ టీవీలో ప్రసారమైన జననాయగన్
Jana Nayagan | తమిళ హీరో దళపతి విజయ్ నటించిన జననాయగన్ (Jana Nayagan) సినిమాను కష్టాలు వీడటం లేదు. గతవారం ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా కేబుల్ టీవీలోనే (Cable TV) ప్రసారమైంది.
Entertainment | Published On Apr 14, 2026, 6.59 am IST
Jana Nayagan | త్రినేత్ర.న్యూస్: తమిళ హీరో దళపతి విజయ్ నటించిన జననాయగన్ (Jana Nayagan) సినిమాను కష్టాలు వీడటం లేదు. గతవారం ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా కేబుల్ టీవీలోనే (Cable TV) ప్రసారమైంది. ఆన్‌లైన్‌లో లీకైన ఫుటేజీని తమిళనాడు కోయంబత్తూరులో రాశి కేబుల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న పళనిస్వామి స్వామి అనే వ్యక్తి టీవీలో ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన జననాయగన్.. సెన్సార్ సర్టిఫికెట్ వివాదం కారణంగా వాయిదాపడుతూ వస్తున్నది. విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పైరసీ జరగడం నిర్మాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో లీక్ వ్యవహారంపై నిర్మాణ సంస్థ కెవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జననాయగన్ మూవీ లీక్ కారణమైన ఆరుగురిని తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు టెలిగ్రామ్ ద్వారా హై డెఫినిషన్ ప్రింట్‌ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి, పంపిణీ చేసిన ఒక సమన్వయ పైరసీ నెట్‌వర్క్‌లో భాగమని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
జననాయగన్ సినిమా నుంచి లీకైన సీన్‌లను ఎవరైనా డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేసినా చర్యలు తీసుకుంటామని చిత్ర యూనిట్‌కు చెందిన లాయర్ హెచ్చరించారు. సినిమాను లీక్ చేసిన ఆరుగురిని సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే అరెస్టు చేసిందన్నారు.
సంబంధిత వార్తలు

Jana Nayagan | జన నాయగన్ రెమ్యూనరేషన్లు….దళపతి విజయ్ 220 కోట్లు..పూజా హెగ్డేకు మాత్రం మూడు కోట్లేనట!
మే 8, 2026

Jananayagan OTT | జననాయగన్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్
మే 2, 2026

Jana Nayagan | దళపతి విజయ్ జననాయగన్ సెన్సార్ కష్టాలకు శుభంకార్డు? – రిలీజ్ అప్పుడేనా…
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



