త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Kerala Story 2 | మా ముందు కేర‌ళ స్టోరీని ప్ర‌దర్శించండి.. సినిమా చూశాక నిర్ణ‌యం తీసుకుంటాం : కేర‌ళ హైకోర్టు

The Kerala Story 2 | "ది కేరళ స్టోరీ 2" (The Kerala Story 2) మూవీకి ఇచ్చిన సెన్సార్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కేర‌ళ హైకోర్టు (Kerala High Court)లో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. దీనిపై కోర్టు తాజాగా విచార‌ణ జ‌రిపింది.

D

Entertainment | Published On Feb 24, 2026, 1.30 pm IST

The Kerala Story 2 | మా ముందు కేర‌ళ స్టోరీని ప్ర‌దర్శించండి.. సినిమా చూశాక నిర్ణ‌యం తీసుకుంటాం : కేర‌ళ హైకోర్టు
Advertisement

The Kerala Story 2 | "ది కేరళ స్టోరీ 2" (The Kerala Story 2) మూవీకి ఇచ్చిన సెన్సార్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కేర‌ళ హైకోర్టు (Kerala High Court)లో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. దీనిపై కోర్టు తాజాగా విచార‌ణ జ‌రిపింది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు.. ఈ చిత్రాన్ని తాము వీక్షిస్తామ‌ని తెలిపింది (High Court orders screening of The Kerala Story 2). అందుకు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

"కేరళ రాష్ట్రంలో ప్రజలందరూ పూర్తి సామరస్యంతో జీవిస్తున్నారు. అయితే ఈ సినిమా కేరళను తప్పుగా చిత్రీకరించేలా ఉంది. కేరళ పేరును టైటిల్‌లో ఉపయోగించడం వల్ల రాష్ట్రంపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఇది మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయొచ్చు. అందుకే సెన్సార్ సర్టిఫికేట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఆ చిత్రాన్ని మేము వీక్షిస్తాం. సాధార‌ణంగా సినిమాపై మేము జోక్యం చేసుకోము. కానీ ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల్లో సినిమాను చూడాల‌నుకుంటున్నాం. రేపు మా ముందు సినిమాను ప్ర‌దర్శించండి. అందుకు త‌గిన ఏర్పాటు చేయండి" అని విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ బెచు కురియ‌న్ థామ‌స్ పేర్కొన్నారు. ఈ మేర‌కు స్క్రీనింగ్ టైమ్‌, వేదిక గురించి తెలియ‌జేయాల‌ని చిత్ర నిర్మాత‌ల‌ను ఆదేశించారు.

'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' ట్రైలర్ విడుదలైంది. లవ్ జిహాద్ అంశం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. మూవీపై చాలా మంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో దుమారం రేగుతున్న‌ది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం మూవీని తిర‌స్క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 'ది కేరళ స్టోరీ' సీక్వెల్‌ను విద్వేష‌పూరిత చిత్రంగా అభివ‌ర్ణించారు.

"ది కేరళ స్టోరీ 2"ను వ్యతిరేకించినది కేరళ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. మహారాష్ట్ర సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సైతం ఖండించారు. అయితే, బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ సినిమాను భావ ప్రకటనా స్వేచ్ఛకు లింక్ చేస్తూ సమర్థించారు. తాజాగా ఈ అంశం కోర్టు వ‌ర‌కు చేరింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ క‌న్నూర్‌లోని చిత్ర‌ప‌రంభ నివాసి శ్రీ‌దేవ్ నంబూద్రి కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై స్పందించిన‌ హైకోర్టు ఫిబ్ర‌వ‌రి 20న‌ సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. నిర్మాత స‌న్‌షైన్ పిక్చ‌ర్స్‌ను సైతం స్పంద‌న చెప్పాల‌ని ఆదేశించింది. దీనిపై ఈ నెల 24న విచార‌ణ చేప‌డ‌తామ‌ని కోర్టు తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే నేడు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు సినిమా ప్రదర్శనను వీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

ది కేరళ స్టోరీ 2 స్టోరీ విష‌యానికి వ‌స్తే.. ముగ్గురు హిందూ అమ్మాయిల‌ను ముస్లిం యువ‌కులు పెళ్లి చేసుకోవ‌డం.. ఆ త‌ర్వాత బ‌ల‌వంతంగా ఇస్లాంలోకి మారుస్తున్న‌ట్లుగా ట్రైల‌ర్‌లో చూపించారు. ముఖ్యంగా ల‌వ్ జిహాద్ అంశాన్ని లేవ‌నెత్తారు. ఈ సినిమాలో అదితి భాటియా, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Advertisement