త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Daggubati Family | ద‌క్క‌న్ కిచెన్ హోట‌ల్ కూల్చివేత‌.. నాంపల్లి కోర్టుకు హీరో వెంక‌టేశ్ కుటుంబం

ద‌క్క‌న్ కిచెన్ హోట‌ల్ కూల్చివేత (Deccan Kitchen hotel) వ్య‌వ‌హారంలో సీనియ‌ర్ హీరో ద‌గ్గుబాటి వెంక‌టేశ్ కుటుంబం (Daggubati Family) నాంపల్లి కోర్టుకు హాజ‌రుకానుంది. జ‌న‌వ‌రి 9న వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

G

Entertainment | Published On Jan 9, 2026, 11.45 am IST

Daggubati Family | ద‌క్క‌న్ కిచెన్ హోట‌ల్ కూల్చివేత‌.. నాంపల్లి కోర్టుకు హీరో వెంక‌టేశ్ కుటుంబం
Advertisement

trinethra.news : ద‌క్క‌న్ కిచెన్ హోట‌ల్ కూల్చివేత (Deccan Kitchen hotel) వ్య‌వ‌హారంలో సీనియ‌ర్ హీరో ద‌గ్గుబాటి వెంక‌టేశ్ కుటుంబం (Daggubati Family) నాంపల్లి కోర్టుకు హాజ‌రుకానుంది. జ‌న‌వ‌రి 9న వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌నివారం హీరో వెంక‌టేశ్‌తో స‌హా ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరో రాణా, నిర్మాత సురేశ్ బాబు, అభిరాం న్యాయ‌స్థానం ముందు హాజ‌రుకానున్నారు. హోట‌ల్ కూల్చివేత విష‌యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వ‌నుంద‌ని సర్వత్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది.

దక్కన్ కిచెన్ హోటల్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది, దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13న కూల్చివేశారు. అక్రమంగా కూల్చివేయడంతోపాటు అక్కడ వున్న సామగ్రిని ఎత్తుకెళ్లార‌ని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కోర్టు దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేసింది.

కానీ దగ్గుబాటి బ్రదర్స్ కోర్టు కేసుని లెక్కచేయకుండా మరోసారి 2024 మార్చిలో నందుకుమార్ హోటల్ బిల్డింగ్‌ని వ్యక్తిగత బౌన్సర్లతో పూర్తిగా నేలమట్టం చేశారు,హోటల్‌లో వున్న కోట్ల విలువ చేసే సామగ్రిని తీసుకెళ్లారు. దీనిపై నందకుమార్ మరోసారి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దగ్గుబాటి ఫ్యామిలీపై పిర్యాదు చేశారు. కానీ పోలీసులు స్పందించ‌క‌పోవ‌డంతో మరో మారు నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు.

ఈ పిర్యాదుపై స్పందించిన‌ కోర్టు జనవరి 2025లో కేసు నమోదు చేయాలంటూ పోలీసుల‌ను ఆదేశించింది. దీంతో ఫిల్మ్‌న‌గర్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. ప‌లుమార్లు నోటీలు జారీచేసిన‌ప్ప‌టికీ ద‌గ్గుబాటి కుటుంబం కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. దీంతో జనవరి 9న వ్య‌క్తిగ‌తంగా కోర్టుకి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ద‌గ్గుబాటి కుటుంబం న్యాయ‌స్థానానికి హాజరు అవతారా?, హాజరు కాకపోతే కోర్టు తీసుకొనే తదుపరి చర్యలేంటి? అనే విష‌య‌మై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది. మ‌రోవైపు ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు స్వయంగా బాండ్లను ఇవ్వకుంటే న్యాయ‌స్థానం నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement