Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
Saparya | ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడం.. ఒంటరిగా మిగిలిన వృద్ధులకు తోడుగా నిలవడం.. సేవను ఒక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న ‘మనం సైతం’ (Manam Saitham) ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Entertainment | Published On Sep 23, 2026, 7.21 am IST
Saparya | త్రినేత్ర.న్యూస్: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడం.. ఒంటరిగా మిగిలిన వృద్ధులకు తోడుగా నిలవడం.. సేవను ఒక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న ‘మనం సైతం’ (Manam Saitham) ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సపర్య – వీ కేర్ ఫర్ అన్ కేర్డ్’ (Saparya) పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) తెలిపారు. గత 13 ఏండ్లుగా ‘మనం సైతం’ ద్వారా సమాజంలో ఆపదలో ఉన్నవారికి, అవసరార్థులకు వివిధ రూపాల్లో సహాయాన్ని అందిస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ‘సపర్య’ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు.
జనతా వైద్యం..
ఈ ప్రాజెక్టులో భాగంగా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం (Old Age Home), పేదలకు అందుబాటులో ఉండే ‘జనతా వైద్యం’ (Janatha Vaidyam) హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం (Healthcare Facility ) అందించడంతోపాటు రోగులు, వృద్ధులు, అనాథలు మానసిక ప్రశాంతతతో ఉండేలా దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పెద్ద వాటర్ పాండ్, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్, పచ్చని చెట్లతో కూడిన వనం, గాజు తలుపులతో కూడిన గదులు వంటి సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్యం, వసతి, ఆత్మీయత.. ఈ మూడింటినీ ఒకే చోట అందించాలన్నదే ‘సపర్య’ లక్ష్యమన్నారు.
ఒంటరి వృద్ధులకు తోడుగా
నేటి సమాజంలో పిల్లలు విదేశాల్లోనో, ఇతర నగరాల్లోనో స్థిరపడటంతో చాలామంది వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వృద్ధులను ఆదరించి, వారికి అవసరమైన వసతి, వైద్యం, మానవీయమైన తోడ్పాటును అందించడమే ‘సపర్య’లోని ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు. ‘ఎవరూ లేని వారికి మేమున్నాం’ అనే భరోసా కల్పిస్తామని చెప్పారు.
విద్యా భరోసా
సేవా కార్యక్రమాలను కేవలం వైద్యం, వసతికే పరిమితం చేయకుండా విద్యారంగంలోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ‘క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రత్యేక విద్యా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఐదుగురు సినీ కార్మికుల పిల్లలకు ఉచిత హాస్టల్ వసతితో పాటు రెండేండ్ల పాటు నీట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థులకు ఉచిత ఐఐటీ కోచింగ్ అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సినీ పరిశ్రమకు తెర వెనుక సేవలందించే కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.
తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. కష్టాలు ఎదురైనప్పుడు సమాజంపై ద్వేషం పెంచుకోవడం కంటే.. తనకు సాధ్యమైనంత మేరకు సాటి మనిషికి సాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉందనే భావనతో మనం సైతంను ప్రారంభించానని చెప్పారు. పేదవాళ్లే నా పేరెంట్స్.. పేదవాళ్లే నా కుటుంబం. భగవంతుడు మనల్ని పైకి తీసుకువచ్చినప్పుడు మన రెండో చెయ్యి చాచి వందలాది మంది పేదలను ఆదుకోవాలని తెలిపారు.
అందరి సహకారం కావాలి
‘సపర్య’ ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కార్యక్రమం కాకుండా.. సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన మానవీయ ఉద్యమంగా ఎదగాలని ఆకాంక్షించారు. దాతలు, సినీ ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు ఈ ప్రాజెక్టుకు మనస్ఫూర్తిగా మద్దతు, ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారికి ఆసరా.. ఒంటరిగా ఉన్నవారికి ఆత్మీయత.. పేదలకు వైద్యం.. ప్రతిభ ఉన్న పిల్లలకు విద్య.. ఇలా సేవకు పలు కోణాలను జోడిస్తూ ‘మనం సైతం’ చేపడుతున్న సపర్య ప్రాజెక్ట్.. సేవా భావానికి మరో విస్తృత రూపంగా నిలవనుందని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Komatireddy Venkat Reddy | మరోసారి మంచి మనసు చాటుకున్న కోమటిరెడ్డి.. అనాథలకు ఆర్థిక సాయం అందజేత
జూన్ 13, 2026

CP Sajjanar | వృద్ధాశ్రమంలో సీపీ సజ్జనార్ న్యూఇయర్ వేడుకలు
జనవరి 1, 2026

CP Sajjanar | నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఆ ఒక్కటే.. సీపీ సజ్జనార్ కీలక ట్వీట్
డిసెంబర్ 16, 2025
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!



