త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 | నాకు తెలియకుండా అఖండ టికెట్ల రేట్లు పెంచుకున్నారు – మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి

Akhanda 2 | అఖండ 2 టికెట్ ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. త‌న‌కు తెలియ‌కుండా పొర‌పాటుగా అఖండ‌2 టికెట్ ధ‌ర‌ల పెంపు జీవోను జారీ చేశార‌ని అన్నాడు. ఇక‌పై తెలంగాణ‌లో బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు ఇచ్చేది లేద‌ని పేర్కొన్నారు.

N

Entertainment | Published On Dec 12, 2025, 4.26 pm IST

Akhanda 2 | నాకు తెలియకుండా అఖండ టికెట్ల రేట్లు పెంచుకున్నారు – మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Advertisement

Akhanda 2 |  అఖండ 2 (Akhnada 2) బెనిఫిట్ షోల‌తో పాటు టికెట్ రేట్ల పెంపు జీవోను గురువారం హైకోర్టు ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిపింది. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మేక‌ర్స్ మాత్రం ప్రీమియ‌ర్స్‌ను స్క్రీనింగ్ చేశారు. హైకోర్టు తీర్పుపై సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. త‌న‌కు తెలియ‌కుండా పొర‌పాటుగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తులు ఇచ్చార‌ని అన్నాడు. ఇక‌పై తెలంగాణ‌లో సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండ‌ద‌ని, బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపుకోసం త‌న‌ను ఎవ‌రూ క‌ల‌వ‌ద్ద‌ని అన్నారు.
అఖండ 2కు సంబంధించి హైకోర్టు తీర్పుపై కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ... "తెలంగాణ‌లో సినిమాల టికెట్ రేట్లు పెంచేది లేద‌ని, బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌మ‌ని పుష్ప 2 రిలీజ్ టైమ్‌లోనే చెప్పాం. సినిమా అన్న‌ది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధ‌నం. టికెట్ రేట్లు ఆరు వంద‌లు నుంచి వేయి వ‌ర‌కు పెంచ‌డం వ‌ల్ల మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌పై భారం పెరుగుతోంది. పాప్‌కార్న్ చిప్స్ లాంటివి ప‌దింత‌ల ధ‌ర‌ల‌తో థియేట‌ర్ల‌లో అమ్ముతున్నారు. ఇది స‌రికాదు. ఎన్నిక‌ల‌తో పాటు గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఈవెంట్‌తో బిజీగా ఉన్నా. నాకు తెలియ‌కుండానే అఖండ 2 టికెట్ ధ‌ర‌ల పెంపు జీవో జారీ అయ్యింది. ఈ సారి పొరపాటు జరిగింది. కోర్టు తీర్పును గౌర‌విస్తున్నాం. ఇక‌పై ఎంత పెద్ద హీరోల సినిమాల‌కైనా టికెట్ ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తులు ఇవ్వం. ధ‌ర‌లు పెంచ‌మంటూ ఎవ‌రూ మా వ‌ద్ద‌కు రావ‌ద్దు" అని కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి అన్నారు.
మేక‌ర్స్‌కు ఊర‌ట‌
మ‌రోవైపు అఖండ 2 టికెట్ ధ‌ర‌ల పెంపుతో పాటు బెనిఫిట్ షోల‌కు సంబంధించిన జీవోను హైకోర్టు గురువారం ర ద్దు చేసింది. కోర్టు తీర్పుపై మేక‌ర్స్ డివిజ‌న్ బెంచ్‌కు అప్ల‌య్ చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉ త్త‌ర్వుల‌పై శుక్ర‌వారం డివిజ‌న్ బెంచ్ స్టే విధించింది. త‌దుప‌రి విచార‌ణ డిసెంబ‌ర్ 14న జ‌రుగ‌నుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement