UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన
UNGA | ఉగ్రవాదుల (terrorism) చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అంతర్జాతీయ సమాజం అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరించింది. ప్రపంచ భద్రతకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాలుగా మారిందని స్పష్టం చేసింది.
International | Published On Oct 20, 2026, 12.25 pm IST
UNGA | త్రినేత్ర న్యూస్ : సామూహిక వినాశక ఆయుధాల బదిలీపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల (terrorism) చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అంతర్జాతీయ సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రత్యేకించి ఉగ్రవాదంతో సంబంధాలు, ఆయుధాలను హింసకు ఉపయోగించే చరిత్ర ఉన్న దేశాలకు (terror linked states) సున్నితమైన, డ్యూయల్ యూజ్ సాంకేతికతలు బదిలీ కాకుండా అన్ని సభ్య దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఐరాస జనరల్ అసెంబ్లీ మొదటి కమిటీ సమావేశంలో (UNGA) భారత్ తరఫున లోక్‌సభ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ మాట్లాడారు. ప్రపంచ భద్రతకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాలుగా మారిందని స్పష్టం చేశారు. "సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉగ్రవాదులు, ఇతర ప్రైవేట్ శక్తుల చేతిలో పడే ప్రమాదంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది" అని పేర్కొన్నారు. భారత్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్, పాక్ అణు శాస్త్రవేత్త ఏ.క్యూ. ఖాన్ నేతృత్వంలోని అంతర్జాతీయ అణు ప్రొలిఫరేషన్ నెట్‌వర్క్‌ను ఉద్దేశించి చేసినట్లుగా పీటీఐ నివేదించింది.
కాగా, ఉగ్రవాదులు సామూహిక విధ్వంసక ఆయుధాలను పొందకుండా నిరోధించే తీర్మానాన్ని ఐరాసలో భారత్ 2002 నుంచి తీర్మానాలను ప్రవేశపెడుతోందని సుమన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉగ్రవాద సంస్థలు లేదా వ్యవస్థేతర శక్తులు (Non-state actors) అణు, రసాయన, జీవ ఆయుధాలు వంటి ప్రమాదకరమైన సామూహిక వినాశన ఆయుధాలను (WMDs) హస్తగతం చేసుకోకుండా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాలనేది ఈ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలో ప్రతి ఏటా భారీ మద్దతు లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ వస్తున్నాయి.
Also Read..
ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం
అక్టోబర్ 17, 2026

S Jaishankar | భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్రవాదం కీలక అంశం : జైశంకర్
సెప్టెంబర్ 29, 2026

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..
- ●India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!
- ●JD Vance H1B Visa Remarks | నా అత్తమామలు సౌత్ ఇండియన్సే, వారిని ప్రేమిస్తాను కానీ..!
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.8వేలు తగ్గిన బంగారం ధర.. కారణం ఇదేనా..?
- ●Dhanush Political Entry | సీఎం విజయ్ బాటలో ధనుష్? ఆ ఒక్క మార్పు వెనుక అసలు కథ ఇదే!
- ●Tiger Shroff | గన్ జామ్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డ నటుడు.. టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక విషయాలు..

Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..

India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!

JD Vance H1B Visa Remarks | నా అత్తమామలు సౌత్ ఇండియన్సే, వారిని ప్రేమిస్తాను కానీ..!

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.8వేలు తగ్గిన బంగారం ధర.. కారణం ఇదేనా..?



