త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MSVPG Collections | బ్రేక్ ఈవెన్‌కు చేరువ‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు – సంక్రాంతి విన్న‌ర్‌గా మెగాస్టార్

చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు(Mana Shankara Vara Prasad Garu) మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఐదు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 226 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో లాభాల్లోకి అడుగుపెట్ట‌నున్న తొలి మూవీగా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు నిల‌వ‌బోతుంది.

N

Entertainment | Published On Jan 17, 2026, 6.45 pm IST

MSVPG Collections | బ్రేక్ ఈవెన్‌కు చేరువ‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు – సంక్రాంతి విన్న‌ర్‌గా మెగాస్టార్
Advertisement

MSVPG Collections | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu)మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. బ్రేక్ ఈవెన్‌కు చేరువ‌లో ఉంది. సంక్రాంతి సినిమాల్లో లాభాల్లోకి అడుగుపెట్ట‌నున్న ఫ‌స్ట్ మూవీగా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు నిల‌వ‌బోతుంది.

226 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఐదు రోజుల్లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ 226 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 113 కోట్ల వ‌ర‌కు వ‌ర‌కు షేర్ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. ఐదు రోజుల్లో మెగాస్టార్ మూవీ 92 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ సాధించింద‌ట‌.
122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ లాభాల్లోకి అడుగుపెట్ట‌డానికి మ‌రో తొమ్మిది కోట్లు వ‌స్తే చాల‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. శ‌నివారం నాటి క‌లెక్ష‌న్స్‌తో ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి ఎంట‌ర‌వ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఓవ‌ర్‌సీస్‌లో దూకుడు

తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 74 కోట్ల‌కుపైగా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. ప్రీమియ‌ర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావ‌డం, వెంక‌టేష్ - చిరంజీవిల‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా రిలీజై ఐదు రోజులు దాటినా వ‌సూళ్లు జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. శుక్ర‌వారం రోజు ఈ మూవీ ఇర‌వై ఐదు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో స‌త్తా చాటింది.
ఓవ‌ర్‌సీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 2.5 మిలియ‌న్ల క‌లెక్ష‌న్స్‌ను దాటిన ఈ మూవీ మూడు మిలియ‌న్ల వైపు దూసుకుపోతుంది.
ప్ర‌భాస్ రాజాసాబ్‌తో పాటు ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాల‌కు నెగెటివ్ టాక్ రావ‌డం చిరంజీవి మూవీకి క‌లిసివ‌చ్చింది. శ‌ని, ఆదివారాల్లో ఈ సినిమా క‌లెక్ష‌న్స్ పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.
ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ ఐదు వంద‌ల కోట్ల మార్క్‌ను ట‌చ్ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రిన్ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

వెంక‌టేష్ గెస్ట్ రోల్‌...

భార్యాపిల్ల‌ల‌కు ఓ సెక్యూరిటీ ఆఫీస‌ర్ ఎందుకు దూర‌మ‌య్యాడు? వారికి ద‌గ్గ‌ర కావ‌డానికి మ‌ళ్లీ ఏం చేశాడు అనే పాయింట్‌తో అనిల్ రావిపూడి ఈ మూవీని రూపొందించారు. శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు పాత్ర‌లో చిరంజీవి కామెడీ టైమింగ్‌, స్వాగ్‌, ఆయ‌న డ్యాన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. వెంకీ గౌడ పాత్ర‌లో వెంక‌టేష్ గెస్ట్ రోల్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement