త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి వ‌చ్చిన వెరైటీ టైటిల్ మ‌ల‌యాళం మూవీ – సినిమా డైరెక్ట‌ర్‌కు దేవుడు ప్ర‌త్య‌క్ష‌మైతే…?

వెరైటీ టైటిల్‌తో తెర‌కెక్కిన మ‌ల‌యాళం మూవీ రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ ఓటీటీలోకి వ‌చ్చింది. స‌న్నీ వేన్‌, సైజు కురుప్‌, అప‌ర్ణ‌దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Mar 22, 2026, 4.08 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి వ‌చ్చిన వెరైటీ టైటిల్ మ‌ల‌యాళం మూవీ – సినిమా డైరెక్ట‌ర్‌కు దేవుడు ప్ర‌త్య‌క్ష‌మైతే…?
Advertisement

Malayalam OTT |  మ‌ల‌యాళం మూవీ రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ ఓటీటీలోకి వ‌చ్చింది. వెరైటీ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా మ‌నోర‌మా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో స‌న్నీ వేన్‌, సైజు కురుప్‌, అప‌ర్ణ‌దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఫేబీ జార్జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మంచి సినిమాగా...

రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ మంచి సినిమాగా మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను అందుకుంది. కాన్సెప్ట్‌తో పాటు స‌న్నీవేన్‌, సైజు కురుప్ యాక్టింగ్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. ఈ సినిమాతోనే ఫేబీ జార్జ్ డైరెక్ట‌ర్‌గా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గ‌త ఏడాది జూన్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ దాదాపు తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

సినిమా డైరెక్ట‌ర్‌...

జిజో ఓ మూవీ డైరెక్ట‌ర్‌. అగ్ర ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న అత‌డి జీవితం ఒక్క ఫ్లాప్‌తో మొత్తం రివ‌ర్స్ అవుతుంది. నెక్స్ట్ సినిమా కోసం తంటాలు ప‌డుతుంటాడు. మ‌రోవైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. అదే టైమ్‌లో జిజోకు దేవుడు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. దేవుడి స‌హాయంతో త‌న క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని జిజో అనుకుంటాడు. కానీ దేవుడే జిజోను ఓ వ‌రం అడుగుతాడు? అదేమిటి? దేవుడి కోరిక‌ను నెర‌వేర్చ‌డంలో జిజో స‌క్సెస్ అయ్యాడా? జిజోకు దేవుడు క‌నిపించ‌డానికి కార‌ణం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

తెలుగులో...

రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్‌లో హీరోయిన్‌గా న‌టించిన అప‌ర్ణ దాస్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసింది. మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన ఆదికేశ‌వ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. అప‌ర్ణ దాస్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ దాదా...తెలుగులో పాపా పేరుతో రిలీజైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement