త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu | హాలీవుడ్ సినిమాతో వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబు మ‌ల్టీప్లెక్స్ ప్రారంభం – ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

టాలీవుడ్ హీరోలు వెంక‌టేష్, మ‌హేష్‌బాబు ఏఎమ్‌బీ విక్ట‌రీ పేరుతో హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఓ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ను నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లోనే ఫ‌స్ట్ ఐమాక్స్ స్క్రీన్‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఏఎమ్‌బీ విక్ట‌రీ లాంఛింగ్ డేట్ ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 18 నుంచి హాలీవుడ్ మూవీ డ్యూన్ 3తో ఈ మ‌ల్టీప్లెక్స్‌లో సినిమాల స్క్రీనింగ్ మొద‌లుకాబోతుంది.

N

Entertainment | Published On Nov 17, 2026, 7.18 pm IST

Mahesh Babu |  హాలీవుడ్ సినిమాతో వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబు మ‌ల్టీప్లెక్స్ ప్రారంభం – ప్ర‌త్యేక‌త‌లు ఇవే…
Advertisement

Mahesh Babu |టాలీవుడ్ హీరోలు ఒక్కొక్క‌రుగా థియేట‌ర్ బిజినెస్‌లోకి అడుగుపెడుతోన్నారు. ఇప్ప‌టికే మ‌హేష్‌బాబుకు హైద‌రాబాద్‌తో పాటు బెంగ‌ళూరులో ఏఎమ్‌బీ పేరుతో మ‌ల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. తాజాగా హైద‌రాబాద్‌లో మ‌రో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ను లాంఛ్ చేయ‌బోతున్నారు మ‌హేష్‌బాబు. ఏఎమ్‌బీ విక్ట‌రీ పేరుతో హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ప్రారంభం కాబోతుంది.

ఐమాక్స్ స్క్రీన్‌....

ఏషియ‌న్ గ్రూప్ భాగ‌స్వామ్యంతో టాలీవుడ్ హీరోలు వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబు ఏఎమ్‌బీ విక్ట‌రీని నిర్మించారు. హైద‌రాబాద్‌లో ఫ‌స్ట్ ఐమాక్స్ స్క్రీన్‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతుంది. ఏఎమ్‌బీ విక్బ‌రీలో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉండ‌బోతున్నాయి. ఇందులో ఐమాక్స్‌, 4డీఎక్స్ స్క్రీన్ ఈ మ‌ల్టీప్లెక్స్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు సమాచారం. మ‌రో ఐదు నార్మ‌ల్ స్క్రీన్స్ కూడా ఉండ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

హాలీవుడ్ మూవీ....

ఏఎమ్‌బీ విక్ట‌రీ లాంఛింగ్ డేట్ ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. ఈ థియేట‌ర్‌లో డిసెంబ‌ర్ 18 నుంచి సినిమాల స్క్రీనింగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. హాలీవుడ్ మూవీ డ్యూన్ 3తో ఏఎమ్‌బీ విక్ట‌రీ ప్రారంభం కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో మ‌ల్టీప్లెక్స్‌ ప్రారంభోత్స‌వ వేడుక గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌కు మ‌హేష్‌బాబు, వెంక‌టేష్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు అటెండ్ కానున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement