త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

హైద‌రాబాద్‌లో కొత్త‌గా అల్లు అర్జున్‌, మ‌హేష్ బాబు మ‌ల్టీప్లెక్స్‌లు – మ‌రో మూడు కూడా లాంఛ్‌

N

Entertainment | Published On Dec 7, 2025, 10.50 am IST

హైద‌రాబాద్‌లో కొత్త‌గా అల్లు అర్జున్‌, మ‌హేష్ బాబు మ‌ల్టీప్లెక్స్‌లు – మ‌రో మూడు కూడా లాంఛ్‌

మహేష్ బాబు

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మెళ్ల‌మెళ్ల‌గా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌లు క‌నుమ‌రుగ‌వుతున్నాయి. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ పెరుగుతోంది. చిన్న చిన్న సిటీస్‌ల‌లో సైతం మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల సంస్కృతి విస్త‌రిస్తుంది. ఈ థియేట‌ర్ బిజినెస్‌ల‌లోకి హీరోలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, ర‌వితేజ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి స్టార్ హీరోలు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌డ‌మే కాకుండా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. వీరి బాట‌లోనే మ‌రికొంద‌రు హీరోలు అడుగులు వేయ‌బోతున్నారు.
ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు ఏఎమ్‌బీ థియేట‌ర్ హైద‌రాబాద్‌కు త‌ల‌మానికంగా మారింది. సెలిబ్రిటీల నుంచి సినీ ల‌వ‌ర్స్ అంద‌రికి ఈ థియేట‌ర్ అడ్డ‌గా మారిపోయింది. తాజాగా హైద‌రాబాద్‌లో మ‌హేష్‌బాబు మ‌రో కొత్త మ‌ల్టీప్లెక్స్ లాంఛ్ చేయ‌బోతున్నారు. ఏఎమ్‌బీ క్లాసిక్‌ పేరుతో రూపొందుతున్న ఈ మ‌ల్టీప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మొద‌లుకాబోతుంది. ఏషియ‌న్ గ్రూప్‌తో క‌లిసి ఈ మ‌ల్టీప్లెక్స్‌ను మ‌హేష్‌బాబు నెల‌కొల్ప‌నున్నారు. మొత్తం ఎనిమిది స్క్రీన్స్‌తో ఈ థియేట‌ర్ ప్రారంభం కాబోతుంది. సంక్రాంతికి ఏఎమ్‌బీ క్లాసిక్ మ‌ల్టీప్లెక్స్ లాంఛ్ కానున్న‌ట్లు స‌మాచారం.
ఏఏఏ సినిమాస్ త‌ర్వాత అల్లు అర్జున్ కూడా హైద‌రాబాద్‌లోని కోకాపేట్‌లో మ‌రో మ‌ల్టీప్లెక్స్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. అల్లు సినిమాస్ పేరుతో నిర్మించిన ఈ మ‌ల్టీప్లెక్స్ లో జ‌న‌వ‌రి నుంచి సినిమాల‌ను స్క్రీనింగ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోనే అతి పెద్ద స్క్రీన్‌తో ఈ థియేట‌ర్ సినీ ల‌వ‌ర్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. అల్లు సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. వైజాగ్‌లోనూ అల్లు అర్జున్ ఓ థియేట‌ర్‌ను ప్రారంభించ‌బోతున్నారు.
ఇవే కాకుండా అప‌ర్ణ మాల్ శంషాబాద్ (ఏడు స్క్రీన్స్‌), పీవీఆర్ ఐనాక్ కూక‌ట్‌ప‌ల్లి ( తొమ్మిది స్క్రీన్ల‌)తో పాటు మ‌రికొన్ని మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లు త్వ‌ర‌లోనే జ‌న‌వ‌రిలో లాంఛ్ కానున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది.
ఇటీవ‌ల ర‌వితేజ కూడా హైద‌రాబాద్‌లో ఏఆర్‌టీ సినిమాస్ పేరుతో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ప్రారంభించారు. రామ్‌చ‌ర‌ణ్ కూడా థియేట‌ర్ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement