Samantha | సమంత ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది..! సంక్రాంతికి ముందే టీజర్ ట్రైలర్..!
Samantha | ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్‌రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులకు పవర్‌ఫుల్, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని పేర్కొన్నారు.
Samantha | ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్‌రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులకు పవర్‌ఫుల్, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. సమంతతో ఇది వరకు ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నందినీ రెడ్డి.. మరోసారి ‘మా ఇంటి బంగారం’ మూవీకి డైరెక్ట్ చేస్తోంది. వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలున్నాయి. అయితే, ఈసారి మాత్రం డిఫరెంట్ ఎమోషన్స్, స్టోరీతో, బోల్డ్‌గా, గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా మా ఇంటి బంగారం సినిమా ఉండబోతోందని మేకర్స్ పేర్కొంటున్నారు.
ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే సమంత లుక్ చాలా పవర్‌ఫుల్‌గా, ఎఫెక్టివ్‌గా కనిపించి సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆమె పాత్రలోని ఇంటెన్సిటీ, పాత్రను తీర్చిదిద్దిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. రా, హై ఇంపాక్ట్ యాక్షన్‌తో మన భారతీయ శైలిని మిక్స్ చేసిన పాత్రలో సమంత అలరించనుంది. ఈ క్రమంలో 9న విడుదల కానున్న టీజర్ ట్రైలర్‌పై అంచనాలు పెరిగాయి. ఖుషి మూవీ తర్వాత సమంత రీల్‌లో నటిస్తుండడం విశేషం. దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథనం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను వసంత్ మారిన్‌గంటి, రాజ్ నిడిమోరు రచించగా, ప్రముఖ రచయిత సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్‌విజన్‌గా వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



