Lokesh Kanagaraj | రెమ్యూనరేషన్ కోసమే అల్లు అర్జున్‌తో మూవీ చేస్తున్నాడా? – ట్రోల్స్‌పై లోకేష్ కగనరాజ్ ఏమన్నారంటే?
రెమ్యూనరేషన్ కోసమే ఖైదీ 2 కాకుండా అల్లు అర్జున్ సినిమాను లోకేష్ కనగరాజ్ అంగీకరించినట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ 2 ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై లోకేష్ కనగరాజ్ రియాక్ట్ అయ్యారు.
Entertainment | Published On Jan 26, 2026, 4.21 pm IST
అల్లు అర్జున్ మూవీతో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రకటనతోనే ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్‌లో బజ్ ఏర్పడింది.కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ కార్తీతో ఖైదీ 2 సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ సడెన్‌గా అల్లు అర్జున్‌తో లోకేష్ మూవీని చేయబోతున్నట్లు ప్రకటించడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్‌తో సినిమా కోసం లోకేష్ కనగరాజ్ 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రెమ్యూనరేషన్ కోసమే ఖైదీ 2 సినిమాను పక్కనపెట్టి అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఖైదీ 2 ఆగిపోయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
రెమ్యూనరేషన్ కోసం కాదు...
ఈ పుకార్లపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. రెమ్యూనరేషన్ కోసం కాదని గతంలో ఉన్న కమిట్‌మెంట్స్‌తోనే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. "కూలీ తర్వాత ఖైదీ 2 సినిమానే చేయాలి. కానీ కార్తి డేట్స్ అందుబాటులో లేవు. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమా చేస్తానని ఆరేళ్ల క్రితమే మాటిచ్చా. ఆ కమిట్‌మెంట్‌లోనే భాగాంగానే అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది" అని అన్నారు.
ఎల్‌సీయూ ఆగిపోలేదు...
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఆగిపోయినట్లు వస్తోన్న రూమర్లపై కూడా రియాక్ట్ అయ్యారు లోకేష్ కనగరాజ్. "అల్లు అర్జున్ మూవీ పూర్తయిన తర్వాత ఖైదీ 2ను రూపొందిస్తానని అన్నారు. రోలెక్స్‌తో పాటు మిగిలిన పాత్రలతో ఎల్‌సీయూ సినిమాలు ఉంటాయన్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ మూవీ ఎల్‌సీయూలో ఓ భాగంగానే తెరకెక్కుతోంది. ఈ సినిమానే నేను కథను అందించా" అని చెప్పారు.
మల్టీస్టారర్ మిస్...
కూలీ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం వచ్చిందని లోకేష్ కనగరాజ్ అన్నారు. "యాభై రోజుల పాటు కష్టపడి ఓ యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశా. ఇద్దరికి నచ్చింది. కానీ వరుసగా కమల్‌హాసన్, రజనీకాంత్ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. యాక్షన్ కాకుండా లైట్ హార్టెడ్ కథ అయితే బాగుంటుందని అన్నారు. అలాంటి కథలతో సినిమాలు చేయడం నాకు రాదు. అదే విషయం రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్‌కు చెప్పారు. వారు పాజిటివ్‌గా తీసుకున్నారు" అని లోకేష్ అన్నాడు. దళపతి విజయ్ అప్‌కమింగ్ మూవీ జననాయగన్‌లో తాను గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. విజయ్, డైరెక్టర్ వినోథ్‌తో ఉన్న అనుబంధంతోనే ఆ సినిమాలో నటించినట్లు లోకేష్ కనగరాజ్ పేర్కొన్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



