త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krystle D’Souza | ధురంధర్‌-2లో క్రిస్టల్‌ డిసౌజా.. క్లారిటీ ఇచ్చిన షెరారత్‌ బ్యూటీ..!

Krystle D’Souza | బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ధురంధర్‌-2 మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీపై వస్తున్న రూమర్స్‌ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్‌ క్రిస్టల్ డిసౌజా ఈ మూవీలో మళ్లీ కనిపించనుందనే వార్త వైరల్‌గా మారింది.

P

Entertainment | Published On Mar 18, 2026, 2.00 pm IST

Krystle D’Souza | ధురంధర్‌-2లో క్రిస్టల్‌ డిసౌజా.. క్లారిటీ ఇచ్చిన షెరారత్‌ బ్యూటీ..!
Advertisement

Krystle D’Souza | బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ధురంధర్‌-2 మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీపై వస్తున్న రూమర్స్‌ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్‌ క్రిస్టల్ డిసౌజా ఈ మూవీలో మళ్లీ కనిపించనుందనే వార్త వైరల్‌గా మారింది. అయితే, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్రిస్టల్‌ స్పందించింది. ధురంధర్‌ మూవీలో షరారత్‌ సాంగ్‌తో క్రిస్టల్‌ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ధురంధర్‌ 2లో నటిస్తున్నట్లుగా వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఫిల్మీగ్యాన్‌కు ఇచ్చిన ఇంట్వర్యూలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టింది. ధురంధర్‌ 2లో తాను నటించలేదని స్పష్టం చేసింది. అయితే, ప్రీమియర్‌కు హాజరవుతానని తెలిపింది.

అయితే, ఎక్కడైనా ఒక్కసారిగా కనిపించవచ్చు కూడా’ అంటూ సరదాగా స్పందించింది. దాంతో మళ్లీ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. సినిమాలో తన పాత్ర లేదని స్పష్టంచేసినా, ఆమె కామెంట్‌ అభిమానుల్లో సర్‌ప్రైజ్‌ ఎంట్రీపై ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉంటే, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగానికి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ హమ్జా అలీ మజారి పాత్రను మళ్లీ మెరువనున్నాడు. కథ పరంగా జస్కిరత్‌ సింగ్‌ అనే వ్యక్తి రంగా, హమ్జా వేషాల్లో పాకిస్తాన్‌లోకి చొరబడి ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో సినిమా సాగుతుంది. చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్‌, రాకేశ్‌ బేడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టల్‌ డిసౌజా ఈ చిత్రంలో నటించకపోయినా.. ఆమె చేసిన కామెంట్స్‌ ధురంధర్‌2పై మరింత హైప్‌ని పెంచాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement