Krithi Shetty | కృతిశెట్టికి లక్కీ ఛాన్స్.. వెంకటేశ్-అనిల్ రావిపుడి మూవీలో హీరోయిన్‌గా..!
Krithi Shetty | తొలి సినిమా ‘ఉప్పెన’ మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది. వరుస అవకాశాలు వచ్చినా సరైన హిట్ దొరకడం లేదు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కార్తీతో కలిసి నటించిన సినిమా భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
Entertainment | Published On Mar 27, 2026, 2.15 pm IST
Krithi Shetty | తొలి సినిమా ‘ఉప్పెన’ మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది. వరుస అవకాశాలు వచ్చినా సరైన హిట్ దొరకడం లేదు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కార్తీతో కలిసి నటించిన సినిమా భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రదీప్ రంగనాథన్‌తో చేసి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం విడుదలకు సైతం ఇంకా అడ్డంకులు తొలగడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌లో చిరంజీవి కూతురు పాత్ర కోసం కృతి శెట్టిని సంప్రదించినట్టు ప్రచారం జరిగింది. ఆమె రెస్పాన్స్ లేకపోవడంతో ఆ అవకాశం మరో యంగ్ బ్యూటీకి దక్కిందన్న వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా కృతి శెట్టికి మరో పెద్ద అవకాశం వచ్చినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కలిసి నటించనున్న ఎంటర్‌టైనర్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన కీర్తి సురేష్ ఇప్పటికే ఎంపికైనట్లు సమాచారం. అదే సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా కృతి శెట్టిని తీసుకున్నారని ఫిలింనగర్ టాక్ నడుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఉంటుందనే విషయం తెలిసిందే. పాత్రలకు తగిన స్క్రీన్ స్పేస్ ఇచ్చే ఆయన స్టయిల్ కారణంగా కృతి శెట్టికి కూడా నటనకు మంచి అవకాశం దక్కే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో ఆమెతో పాటు ఉన్న ఇతర నటీనటులు సీనియర్లు కావడంతో తన ప్రతిభను నిరూపించుకోవడం కొంత సవాల్‌గా మారే అవకాశం ఉంది. జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మూవీని 2027 సంక్రాంతి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



