Trisha | ఎన్నికలయ్యే వరకు ఇంట్లోనే ఉండు… బయట అడుగుపెట్టకు – త్రిషకు తమిళ నటుడి సలహా
విజయ్, త్రిష రిలేషన్‌పై కోలీవుడ్ సీనియర్ నటుడు పార్తిబన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిష బయటకు వస్తే అన్ని అన్ని సమస్యలే వస్తున్నాయని పార్తిబన్ అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు త్రిష ఇంట్లోనే ఉంటే మంచిదంటూ కామెంట్స్ చేశారు.
Entertainment | Published On Mar 8, 2026, 5.35 pm IST
Trisha | కోలీవుడ్‌లో దళపతి విజయ్, త్రిష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు విజయ్, త్రిష ప్రేమాయణం రూమర్ మాత్రమేనని చాలా మంది భావించారు. కానీ విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం...ఆ తర్వాత రోజే ఓ తమిళ నిర్మాత కొడుకు రిసెప్షన్‌కు త్రిషతో కలిసి విజయ్ హాజరుకావడంతో కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. భార్యకు విడాకులు ఇచ్చి త్రిషను త్వరలోనే దళపతి విజయ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇమేజ్ డ్యామేజ్...
మరోవైపు ఎన్నికల ముంగిట త్రిషతో బంధం బయటపడటం, విడాకుల కారణంగా విజయ్ ఇమేజ్‌కు గట్టిగానే డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాలు చెబుతోన్నాయి. విజయ్, త్రిష బంధంపై కోలీవుడ్ వర్గాలు మాత్రం రియాక్ట్ కావడం లేదు. అందరూ సెలైంట్‌గా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సీనియర్ హీరో...
తాజాగా విజయ్, త్రిష గురించి తమిళ సీనియర్ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట వివాదాస్పదంగా మారాయి. ఓ అవార్డ్ వేడుకలో ఇన్‌డైరెక్ట్‌గా త్రిషపై పార్తిబన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. త్రిషను పేరు ప్రస్తావించకుండా పొన్నియన్ సెల్వన్‌లో ఆమె చేసిన కుందవై అంటూ పార్తిబన్ పేర్కొన్నాడు. "కుందవై బయట అడుగుపెడితే అన్ని సమస్యలే వస్తున్నాయని అన్నాడు. ఎన్నికలు అయ్యే వరకు కుందవై ఇంట్లోనే ఉండాలి. ఆమె బయటకు రాకపోవడమే అందరికి మంచిది. కుందవై గడపదాటి బయట అడుగుపెడితే అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి" అంటూ కామెంట్స్ చేశాడు. సరదాగా పార్తిబన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట వైరల్ అయ్యాయి. పార్తిబన్‌ను విజయ్‌తో పాటు త్రిష అభిమానులు తెగ ట్రోల్ చేస్తోన్నారు.మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో త్రిషతో కలిసి పార్తిబన్ నటించారు.
విజయ్ కూడా...
విడాకుల వార్తలపై విజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. తన నమస్యలు తాను పరిష్కరించుకోగలనని, వాటి గురించి అభిమానులు బాధపడటం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. అభిమానులు తమ సమయం కేటాయించేంతా విలువైన విషయాలు కావని అన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



