త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh Wedding | విరోష్ పెళ్లి మెనూ ఇదే – తెలంగాణ మ‌ట‌న్ బిర్యానీ …. కూర్గ్ పంది కూర

విజ‌య్, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఘ‌నంగా జ‌రిగింది. హిందూతో పాటు కొడ‌వ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఈ జంట పెళ్లిపీట‌లెక్కారు. విరోష్ పెళ్లిలో తెలంగాణ‌తో పాటు కూర్గ్ సంప్ర‌దాయ వంట‌కాల‌ను అతిథుల‌కు వ‌డ్డించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

a

Entertainment | Published On Feb 26, 2026, 5.43 pm IST

Virosh Wedding | విరోష్ పెళ్లి మెనూ ఇదే – తెలంగాణ మ‌ట‌న్ బిర్యానీ …. కూర్గ్ పంది కూర
Advertisement

Virosh Wedding | టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు. రాజ‌స్థాన్ ఉద‌య్‌పూర్‌లోని మెమోంటోస్ హోట‌ల్‌లో గురువారం విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి జ‌రిగింది. హిందూ, కొడ‌వ రెండు సంప్ర‌దాయాల్లో వీరు వివాహం చేసుకున్నారు. ఉద‌యం తెలుగు ప‌ద్ద‌తిలో ర‌ష్మిక మెడ‌లో మూడుముళ్లు వేశాడు విజ‌య్‌. ఆ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న కుటుంబానికి చెందిన కొడ‌వ ఆచారం ప్ర‌కారం కూడా వీరి వివాహ వేడుక‌ జ‌రిగింది.

టాలీవుడ్ నుంచి...

విరోష్ వివాహ వేడుక‌లో విజ‌య్‌, ర‌ష్మిక కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అతి కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. టాలీవుడ్ నుంచి సందీప్ వంగా, త‌రుణ్ భాస్క‌ర్‌తో పాటు కొంద‌రు హీరోయిన్లు అటెండ్ అయ్యారు.

అరిటాకు భోజ‌నాలు...

విరోష్ పెళ్లిలో అతిథుల కోసం తెలంగాణ‌తో పాటు కొడ‌వ స్టైల్ వంట‌కాల‌ను వ‌డ్డించార‌ట‌. తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫేమ‌స్ వంట‌కాల‌న్నింటిని సిద్ధం చేయించిన‌ట్లు తెలిసింది. ఇండియ‌న్‌తో పాటు జ‌ప‌నీస్ వంట‌కాల‌తో అతిథుల‌కు స్పెష‌ల్‌గా విందు ఇచ్చార‌ట‌. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఉద‌యం పెళ్లి జ‌రిగిన త‌ర్వాత ఏర్పాటు చేసిన లంఛ్‌లో అరిటాకులో భోజ‌నాల‌ను వ‌డ్డించిన‌ట్లు చెబుతున్నారు.

కూర్గ్ పంది కూర‌...

విజ‌య్ ర‌ష్మిక పెళ్లిలో హైద‌రాబాద్ ధ‌మ్ బిర్యానీ, నాటుకొడి పులుసుతో పాటు కూర్గ్ ఏరియాలో ఫేమ‌స్ అయిన పంది కూర స్పెష‌ల్‌గా నిలిచిన‌ట్లు చెబుతోన్నారు. తెలంగాణ స్టైల్‌లో గారెలు, ప‌చ్చిపులుసు, ప‌ప్పు, పెరుగు ప‌చ్చ‌డి మెనూ లిస్ట్‌లో ఉన్నాయ‌ట‌.కూర్గ్ ఏరియాలో ఫేమ‌స్ అయిన పంది కూర‌తో పాటు క‌దంబ‌ట్టు, నూల్‌పుట్టు, బాంబూ షూట్ క‌ర్రీని కూడా ప్రిపేర్ చేయించిన‌ట్లు స‌మాచారం.ర‌ష్మిక‌కు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్ట‌మ‌ట‌. ఆమె కోసం హైద‌రాబాదీలో ఫేమ‌స్ అయిన ప‌లు స్వీట్స్‌ను విజ‌య్ ప్రిపేర్ చేయించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement