Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం – కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్
ప్యారడైజ్, డోరతీ సక్సెస్‌ల తర్వాత మరో వెరైటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కీర్తి సురేష్. తమిళంలో సత్యవాన్ సావిత్రి పేరుతో ఓ సినిమా చేసింది. కోర్ట్ రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని నవంబర్ 20న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్‌పై మాత్రం విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.
Entertainment | Published On Oct 2, 2026, 3.39 pm IST
Keerthy Suresh | పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతుంటాయి. ఇమేజ్‌కు భిన్నమైన క్యారెక్టర్లు చేస్తే విమర్శలు వస్తాయని భయపడుతుంటారు. పాత్రల పరంగా ప్రయోగాలు చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. కానీ కీర్తి సురేష్ కెరీర్ ఇందుకు మినహాయింపుగా సాగుతుంది. పెళ్లికి ముందు బబ్లీ గర్ల్, సాఫ్ట్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది. పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో తన స్టైల్ మార్చేసింది. వెరైటీ కథలు, పాత్రలకు ప్రాధాన్యమిస్తోంది. ఇటీవల రిలీజైన ది ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇదే ఆమె కెరీర్‌లో ఫస్ట్ ఐటెంసాంగ్. ప్యారడైజ్‌తో పాటు కీర్తి సురేష్ కథానాయికగా కనిపించిన డోరతీ మూవీ ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోన్నాయి.
కోర్ట్ రూమ్ థ్రిల్లర్...
ఈ జోష్‌లోనే మరో కొత్త సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో సత్యవాన్ సావిత్రి పేరుతో ఓ సినిమా చేసింది కీర్తి సురేష్. కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో లాయర్ పాత్రలో కనిపించబోతుంది. ప్రవీణ్ కే విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నవంబర్‌లో...
సత్యవాన్ సావిత్రి రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం ప్రకటించారు నవంబర్ 20న ఈ తమిళ మూవీ థియేటర్లలోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నల్లకోటు ధరించి నుదిటిపై తిలకంతో హోమ్లీ లుక్‌లో కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఆమెతో పాటు ఈ పోస్టర్‌లో మిస్కిన్ కూడా సీరియల్ లుక్‌లో కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
తెలుగు టైటిల్‌పై విమర్శలు...
ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్‌చేశారు. సత్యవాన్ సావిత్రి పేరుతోనే తెలుగులో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌పై విమర్శలు వస్తున్నాయి. సత్యవాన్ సావిత్రి అంటే అర్థం తమిళ ఆడియెన్స్‌కు తెలుస్తుంది కానీ తెలుగు ఆడియెన్స్ ఈ టైటిల్‌కు ఎలా కనెక్ట్ అవుతారని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు టైటిల్ ఛేంజ్ చేయడం మంచిదంటూ కామెంట్లు పెడుతోన్నారు.
జూనియర్ లాయర్...
ఈ సినిమాలో జూనియర్ లాయర్‌గా కీర్తి సురేష్ కనిపించబోతుంది. భర్తకు సంబంధించిన ఓ కేసులో తనకు జూనియర్‌గా ఉద్యోగం ఇచ్చిన సీనియర్ లాయర్‌తోనే కోర్టులో పోటీపడాల్సివస్తుంది. ఈ కేసులో సావిత్రి గెలిచిందా? తన భర్తను కాపాడుకుందా? అనే అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
- ●Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్

Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!






