త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xiaomi SkyNomad | షియోమీ నుంచి కొత్త ఎస్‌యూవీ సిరీస్ కార్లు.. ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే 1700 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

Xiaomi SkyNomad | టెక్ దిగ్గ‌జ సంస్థ షియోమీకి చెందిన ఈవీ త‌యారీ సంస్థ షియోమీ ఈవీ త‌న తొలి షియోమీ కున్‌లున్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన షియోమీ స్కైనోమ్యాడ్ సిరీస్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను అధికారికంగా లాంచ్ చేసింది. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్‌లో ఐదు సీట్లతోపాటు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

S

Automobiles | Published On Aug 3, 2026, 5.06 pm IST

Xiaomi SkyNomad | షియోమీ నుంచి కొత్త ఎస్‌యూవీ సిరీస్ కార్లు.. ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే 1700 కిలోమీట‌ర్ల మైలేజ్‌..
Advertisement

Xiaomi SkyNomad | టెక్ దిగ్గ‌జ సంస్థ షియోమీకి చెందిన ఈవీ త‌యారీ సంస్థ షియోమీ ఈవీ త‌న తొలి షియోమీ కున్‌లున్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన షియోమీ స్కైనోమ్యాడ్ సిరీస్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను అధికారికంగా లాంచ్ చేసింది. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్‌లో ఐదు సీట్లతోపాటు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఎస్‌యూవీలు షియోమీ కున్‌లున్ హైపర్‌రేంజ్, షియోమీ ఆర్మర్ స్కేల్ బ్యాటరీ, షియోమీ కున్‌లున్ టోటల్ సేఫ్టీ టెక్నాలజీలతో వచ్చాయి. ఈ సిరీస్‌లో షియోమీ స్కైనోమ్యాడ్ ఎన్90 మ్యాక్స్ అనే ఏడు సీట్ల ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎస్‌యూవీ, షియోమీ స్కైనోమ్యాడ్ ఎన్70 మ్యాక్స్ అనే ఐదు సీట్ల ఆల్ వీల్ డ్రైవ్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎస్‌యూవీ ఉన్నాయి.

ఏరోడైన‌మిక్ డిజైన్‌..

డిజైన్ పరంగా స్కైనోమ్యాడ్ బాక్సీ ఎస్‌యూవీ స్టైల్‌ను అనుసరిస్తూ, లోపల ఎక్కువ స్థలం లభించేలా ఫ్లాట్ రూఫ్‌లైన్, కంటిన్యూయస్ వెయిస్ట్‌లైన్, ఎత్తైన సిల్ లైన్‌తో రూపొందించారు.హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, డోర్ హ్యాండిల్స్, సైడ్ కెమెరాల్లో గుండ్రని దీర్ఘచతురస్రాకార డిజైన్‌ను ఉపయోగించారు. యాక్టివ్ గ్రిల్, మెరుగైన ఏరోడైనమిక్ డిజైన్ ను క‌లిగి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో స్మార్ట్ ఎలక్ట్రిక్ డోర్లు, దాదాపు 90 డిగ్రీల వరకు తెరుచుకునే వెనుక డోర్లు, డోర్ల చుట్టూ ఉన్న అడ్డంకులను గుర్తించే 360 డిగ్రీల యాంటీ కొలిజన్ సిస్టమ్ ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ సైడ్ స్టెప్‌ను ఐచ్ఛికంగా అందిస్తున్నారు. క్యాబిన్‌లో క్యాబినెట్ స్టైల్ సెంటర్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్, స్టోరేజ్, యాక్సెసరీ సపోర్ట్ ఉన్నాయి. ఎక్కువగా తాకే ప్రాంతాల్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉపయోగించగా, ఎన్90 సిరీస్‌లో మల్టీ లేయర్ సీట్లు, ముందు సీట్లకు మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ ఫీచర్లు అందించారు. ఎక్స్‌టీరియర్‌లో మౌంటెన్ గ్రీన్, వ్యాలీ బ్లూ, వోల్కానిక్ గ్రే రంగులు, ఇంటీరియర్‌లో క్రీమ్ బేజ్, మోకా బ్రౌన్ థీమ్‌లు ఉన్నాయి.

ప‌లు ర‌కాల సీటింగ్ మోడ్‌లు..

ఎన్90 మ్యాక్స్‌లో ఏడు సీట్లు, ఎన్70 మ్యాక్స్‌లో ఐదు సీట్లు ఉన్నాయి. ఎన్90 మ్యాక్స్‌లో గరిష్టంగా 1,831 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అల్టిమేట్ స్టోరేజ్ మోడ్‌లో 20 ఇంచుల పరిమాణం క‌లిగిన‌ 24 సూట్‌కేసులను అమర్చవచ్చని కంపెనీ తెలిపింది. క్యాబిన్‌లో మొత్తం 34 స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లు, స్లైడింగ్ సెంటర్ కన్సోల్‌లో 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్, 9 లీటర్ల రిఫ్రిజిరేటర్, యూఎస్‌బీ సీ పోర్టులు, యాక్సెసరీ ఎక్స్‌పాంషన్ సపోర్ట్, 12 వరకు యాక్సెసరీ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. కుటుంబ ప్రయాణం, కార్గో, పని, విశ్రాంతి వంటి అవసరాలకు అనుగుణంగా వివిధ సీటింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్‌లలో తిరిగే ముందు సీట్లు, జీరో గ్రావిటీ రెండో వరుస సీట్లు కూడా ఉన్నాయి. భద్రత కోసం షియోమీ కున్‌లున్ టోటల్ సేఫ్టీ సిస్టమ్‌ను అందించారు. ఇందులో బాడీ స్ట్రక్చర్, ఎయిర్‌బ్యాగ్‌లు, బ్యాటరీ రక్షణ, డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీలు ఉన్నాయి.

12 ఎయిర్ బ్యాగ్‌లు..

ఎన్90 మ్యాక్స్‌లో స్టీల్ అల్యూమినియం హైబ్రిడ్ బాడీని ఉపయోగించగా, మొత్తం బాడీలో 90.4 శాతం హై స్ట్రెంగ్త్ మెటీరియల్స్ ఉన్నాయి. కీలక ప్రాంతాల్లో 2,200 ఎంపీఏ అల్ట్రా హై స్ట్రెంగ్త్ స్టీల్‌ను ఉపయోగించారు. ఈ ఎస్‌యూవీలో మూడు వరుసల ప్రయాణికులకు రక్షణ కల్పించేలా మొత్తం 12 ఎయిర్‌బ్యాగ్‌లు, తొమ్మిది కొలిజన్ సెన్సర్లు, బలమైన బాడీ నిర్మాణం, మూడో వరుస సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, పొడవైన సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, అత్యవసర డోర్ రిలీజ్ వ్యవస్థ, డ్యుయల్ ఎమర్జెన్సీ టెయిల్‌గేట్ హ్యాండిల్స్, 750 మి.మీ. వరకు నీటిలో ప్రయాణించే సామర్థ్యం, 39 యాంటీ పించ్ రక్షణ పాయింట్లు ఉన్నాయి. షియోమీ ఆర్మర్ స్కేల్ బ్యాటరీలో 18 స్థాయిల నిర్మాణ రక్షణతోపాటు లీకేజ్, అగ్ని ప్రమాదం, థర్మల్ ప్రొపగేషన్‌ను నివారించే పలు భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.

ప‌వ‌ర్‌ఫుల్ కంట్రోల్ సిస్ట‌మ్‌..

స్మార్ట్ ఫీచర్ల కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆధారిత ఫోర్ ఇన్ వన్ డొమైన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో డ్యుయల్ 5జి కనెక్టివిటీ, వైఫై 7, ఆరు స్క్రీన్‌ల క్యాబిన్, 15000 నిట్స్ ప్రకాశంతో కస్టమైజ్ చేయగలిగిన‌ హెడ్ అప్ డిస్‌ప్లే, 25 స్పీకర్ల ఆడియో సిస్టమ్, వెనుక ప్రయాణికుల కోసం కంట్రోల్ డిస్‌ప్లే ఉన్నాయి. వాయిస్ కమాండ్లతో సీట్లు, లైటింగ్, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను నిర్వహించే షియోమీ హైపర్ షియావోఏఐ అసిస్టెంట్‌ను కూడా అందించారు. అసిస్టెడ్ డ్రైవింగ్ కోసం 700 టాప్స్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, లైడార్, 4డి మిల్లీమీటర్ వేవ్ రాడార్, పలు కెమెరాలను అమర్చారు. ఎన్90 సిరీస్‌లో అదనంగా రియర్ లైడార్ కూడా ఉంది. షియోమీ హెచ్‌ఏడీ అసిస్టెడ్ డ్రైవింగ్ సిస్టమ్, ఎక్స్‌ఎల్‌ఏ ఆర్కిటెక్చర్ సహాయంతో వాయిస్ ఆధారిత డ్రైవింగ్ ఫంక్షన్‌లు, భూగర్భ పార్కింగ్ ప్రాంతాల్లో నావిగేషన్ సపోర్ట్ అందిస్తుంది.

రేంజ్ ఎంత‌..

షియోమీ కున్‌లున్ హైపర్‌రేంజ్ టెక్నాలజీ ఆధారంగా ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌తోపాటు రేంజ్ ఎక్స్‌టెండర్ సిస్టమ్‌ను ఉపయోగించారు. 52 కిలోవాట్ అవర్ నుంచి 76 కిలోవాట్ అవర్ వరకు బ్యాటరీ ఆప్ష‌న్‌లు ఉన్నాయి. ఎన్70 మ్యాక్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో సీఎల్‌టీసీ ప్రమాణాల ప్రకారం 505 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఎన్90 మ్యాక్స్ ఎలక్ట్రిక్ మోడ్‌లో 464 కి.మీ., ఎక్స్‌టెండెడ్ రేంజ్‌తో కలిపి గరిష్టంగా 1,705 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని షియోమీ వెల్లడించింది. విద్యుత్ వినియోగం 100 కి.మీ.కు 15.85 కిలోవాట్ అవర్‌గా ఉంది. డ్యుయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ గరిష్టంగా 310 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎన్90 మ్యాక్స్‌లో డబుల్ విష్‌బోన్ ఫ్రంట్ సస్పెన్షన్, హెచ్ ఆర్మ్ మల్టీ లింక్ రియర్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ ఎయిర్ సస్పెన్షన్, కంటిన్యుయస్ వేరియబుల్ డ్యాంపింగ్ వ్యవస్థలను అందించారు. 100 నుంచి 0 కి.మీ. వేగాన్ని తగ్గించేందుకు 38.57 మీటర్ల బ్రేకింగ్ దూరం మాత్రమే అవసరమవుతుంది. టర్నింగ్ రేడియస్ 5.95 మీటర్లుగా ఉంది.

ధ‌ర వివ‌రాలు..

చైనాలో జూలై 30 నుంచి ఈ కార్ల‌కు ప్రీ సేల్స్ ప్రారంభమయ్యాయి. 1000 యువాన్ల డిపాజిట్‌తో వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. షియోమీ స్కైనోమ్యాడ్ ఎన్70 మ్యాక్స్ (5 సీట్ల ఏడబ్ల్యూడీ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎస్‌యూవీ) ధర 2,59,900 యువాన్లు (సుమారు రూ.36.66 లక్షలు) ఉండ‌గా, షియోమీ స్కైనోమ్యాడ్ ఎన్90 మ్యాక్స్ (7 సీట్ల ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎస్‌యూవీ) ధర 2,99,900 యువాన్లు (సుమారు రూ.42.30 లక్షలు)గా ఉంది.

Advertisement
Advertisement