త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | సినిమా ఈవెంట్‌లో కీర్తి సురేష్‌తో ద‌ర్శ‌కుడి అనుచిత ప్ర‌వ‌ర్త‌న – వివాదం చేయ‌ద్దంటూ మ‌హాన‌టి రిప్లై

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన స‌త్య‌వాన్ సావిత్రి మూవీలో త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు మిస్కిన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం చెన్నైలో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేష్‌తో మిస్కిన్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై కీర్తి సురేష్ రియాక్ట్ అయ్యింది.

N

Entertainment | Published On Nov 19, 2026, 2.19 pm IST

Keerthy Suresh | సినిమా ఈవెంట్‌లో కీర్తి సురేష్‌తో ద‌ర్శ‌కుడి అనుచిత ప్ర‌వ‌ర్త‌న – వివాదం చేయ‌ద్దంటూ మ‌హాన‌టి రిప్లై
Advertisement

Keerthy Suresh | కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన "స‌త్య‌వాన్ సావిత్రి" మూవీ న‌వంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్ర‌వీష్ ఎస్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మిస్కీన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ త‌మిళ సినిమా రిలీజ్ ముంగిట మేక‌ర్స్ చెన్నైలో గురువారం ఓ పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ వేడుక‌లో కీర్తి సురేష్‌తో డైరెక్ట‌ర్ మిస్కిన్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ప‌క్క‌ప‌క్క‌నే...

ఈ ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేష్, మిస్కిన్ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. డోర‌తీ సినిమాలో కీర్తి సురేష్ న‌ట‌న‌ను మెచ్చుకునే క్ర‌మంలో ప‌దే ప‌దే ఆమె తొడ‌పై చేయివేస్తూ మాట్లాడారు మిస్కిన్‌. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌తో కీర్తి సురేష్ కాస్త ఇబ్బందిప‌డిన‌ట్లుగా క‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎంత హీరోయిన్ అయినా కీర్తి సురేష్ మ‌హిళ‌నేన‌ని, ప‌బ్లిక్‌గా ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం క‌రెక్ట్ కాదంటూ మిస్కిన్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అనుమ‌తి లేకుండా ఓ మ‌హిళ‌ను అలా ఎలా ట‌చ్ చేస్తాడంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సినిమాకు, ఈవెంట్‌కు తేడా తెలియ‌కుండా ప్ర‌వ‌ర్తించాడంటూ సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌పై ఫైర్ అవుతున్నారు.

వీడియో వైర‌ల్‌...

వీడియో కాస్త వైర‌ల్ కావ‌డంతోఈ వివాదంపై కీర్తి సురేష్ రియాక్ట్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "నా ముఖంలో మీకు ఎక్క‌డ అసౌక‌ర్యం క‌నిపించింది. మా మ‌ధ్య ఉన్న‌ది తండ్రీకూతుళ్ల బంధ‌మే. ఈ విష‌యాన్ని మిస్కిన్ చెప్పారు. నేను కూడా వేడుక‌లో ఇదే మాట అన్నాను. అది విన‌కుండా కేవ‌లం వీడియోను మాత్ర‌మే హైలైట్ చేయ‌డం భావ్యం కాదు.  అన‌వ‌స‌రంగా దీనిని వివాదం చేయ‌ద్దు. సినిమాల్లో న‌న్ను ట‌చ్‌ చేస్తే ఏం అన‌కుండా సైలెంట్‌గా ఎలా ఉంటానో బ‌య‌ట కూడా అలాగే ఉంటాన‌నే స‌మాధానాన్ని నా నుంచి ఆశిస్తున్నారా? దేనినైనా వివాదంగా మార్చేందుకు అస‌లు అక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసుకుంటే బాగుంటుంది" అంటూ కీర్తి సురేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆమె కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

ఇదే వేడుక‌లో డోర‌తీలో కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఫిదా అయిన మిస్కిన్ ఆమెకు స్టేజ్‌పైనే బంగారు ఉంగ‌రాన్ని బ‌హుమ‌తిగా అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement