త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | స‌తీ సావిత్రిగా కీర్తి సురేష్…. పురాణాల ఆధారంగా మ‌హాన‌టి కొత్త మూవీ…

మ‌హాన‌టి కీర్తి సురేష్ త‌మిళంలో ఓ కొత్త మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. పురాణాల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు స‌త్య‌వ‌న్ సావిత్రి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ గురువారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Apr 30, 2026, 1.26 pm IST

Keerthy Suresh | స‌తీ సావిత్రిగా కీర్తి సురేష్…. పురాణాల ఆధారంగా మ‌హాన‌టి కొత్త మూవీ…
Advertisement

Keerthy Suresh |పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ మ‌ళ్లీ స్పీడు పెంచింది. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమాలు బిజీగా ఉంది. తాజాగా మ‌హాన‌టి మ‌రో మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. కోర్ట్ రూమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ గురువారం రిలీజ్ అయ్యాయి.

స‌త్య‌వ‌న్ సావిత్రి...

కీర్తి సురేష్ కొత్త మూవీకి స‌త్య‌వ‌న్ సావిత్రి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో చుట్టూ లాయ‌ర్లు...వారి మ‌ధ్య‌లో కీర్తి సురేష్ క‌నిపిస్తోంది. నుదుట‌న బొట్టుతో సింపుల్‌గా పోస్ట‌ర్‌ను డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

కోర్ట్ రూమ్ డ్రామా....

పురాణాల్లోని స‌తీసావిత్రి పాత్రను నేటి కాలానికి త‌గ్గ‌ట్లుగా తీర్చిదిద్దుతూ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. త‌న భ‌ర్త ప్రాణాల‌కు కాపాడ‌టం కోసం సావిత్రి అనే యువ‌తి చ‌ట్టంతో పాటు య‌ముడు లాంటి ఓ విల‌న్‌తో సాగించిన పోరాటం చుట్టూ ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
స‌త్య‌వ‌న్ సావిత్రి మూవీలో కోలీవుడ్ డైరెక్ట‌ర్ మిస్కిన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. హార్ట్‌బీట్ సిరీస్ ఫేమ్ చారుకేష్‌, బాలాశ‌ర‌వ‌ణ‌న్‌, శిల్పా మంజునాథ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీకి...

ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ప్ర‌వీణ్ ఎస్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా నుంచి మ‌రో లుక్‌ను గురువారం సాయంత్రం రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. స‌త్య‌వ‌న్ సావిత్రి షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంద‌ట‌. ఈ ఏడాదే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

రౌడీ జ‌నార్ధ‌న‌...

ప్ర‌స్తుతం తెలుగులో రౌడీ జ‌నార్ధ‌న‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా న‌టిస్తోంది కీర్తి సురేష్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిందీలో ర‌ఫ్థార్‌, మ‌ల‌యాళంలో తోట్టం సినిమాల‌ను అంగీక‌రించింది.

Advertisement
Advertisement