Keerthy Suresh | పెళ్లి బరాత్‌లో కీర్తి సురేష్ స్టెప్పులు – వీడియో వైరల్
Keerthy Suresh | స్నేహితురాలి పెళ్లి బరాత్‌లో స్టెప్పులతో అదరగొట్టింది కీర్తి సురేష్. దసరా సినిమాలోని చమ్కీల అంగీలేసి అనే పాటకు డ్యాన్స్ చేసింది. కీర్తి సురేష్, హీరో నాని భార్య అంజనా కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Dec 22, 2025, 2.52 pm IST
కీర్తి సురేష్
Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్‌కు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది రిలీజైన బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి (Bollywood) ఎంట్రీ ఇచ్చింది. తేరీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా కీర్తి సురేష్ (Keerthy Suresh) యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది. ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాలీవుడ్‌లో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది.
మరోవైపు పెళ్లి కారణంగా దక్షిణాది సినిమాలకు ఏడెనిమిది నెలల పాటు స్మాల్ గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ స్పీడు పెంచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన సినిమా చేస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీతో దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. మలయాళం, తమిళంలో సినిమాలను అంగీకరించింది.
హీరో నాని భార్యతో స్టెప్పులు...
ఓ వైపు కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూనే మరోవైపు సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్. ఈ బిజీ షెడ్యూల్స్‌లో కీర్తి సురేష్ తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ అయ్యిందట. ఈ పెళ్లి వేడుకలో కీర్తి సురేష్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. దసరా సినిమాలో చమ్కీల అంగీలేసి అనే పాటకు కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది. లైవ్‌లో అయినా సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులు వేసింది. ఈ పాటకు హీరో నాని భార్య అంజనా, స్టైలిష్ట్ కమ్ డైరెక్టర్ నీరజ కోన కూడా కీర్తి సురేష్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీర్తి డ్యాన్స్ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
కాగా ఇటీవలే కీర్తి సురేష్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకుంది. ప్రియుడు ఆంథోనీ తాటిల్‌తో గత ఏడాది డిసెంబర్ 12న గోవాలో కీర్తి సురేష్ పెళ్లి జరిగింది. దాదాపు 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవలే వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకుంది కీర్తి సురేష్.
మరోవైపు కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన రివాల్వర్ రీటా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ డిసెంబర్ 26న ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత వార్తలు

Keerthy Suresh | జిమ్‌లో తెగ కష్టపడుతున్న కీర్తి సురేష్ – వర్కవుట్ ఫొటోలు చూశారా!
మే 17, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026

Unsuitable Sari | వరుడి కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని.. పెండ్లికి నిరాకరించింది..
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



