Keerthy Suresh | కీర్తి సురేష్ తమిళ క్రైమ్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – తెలుగులోనూ రిలీజ్
Keerthy Suresh | కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన క్రైమ్ కామెడీ మూవీ రివాల్వర్ రీటా ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Dec 18, 2025, 8.26 pm IST
Keerthy Suresh
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ రివాల్వర్ రీటా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతున్నట్లు సమాచారం. ఈ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ వారంలోనే రానుంది.
రివాల్వర్ రీటాకు జేకే చంద్రు దర్శకత్వం వహించాడు. ఇందులో రాధికా శరత్‌కుమార్, సునీల్, రెడీన్ కింగ్స్‌లే కీలక పాత్రలు పోషించారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో యాక్షన్ రోల్‌లో కీర్తి సురేష్ మెప్పించింది. కానీ కాన్సెప్ట్‌లో కొత్తదనం మిస్సవ్వడం, థ్రిల్లింగ్ కథను చెప్పడంలో దర్శకుడు తడబడటంతో రివాల్వర్ రీటా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం సందడి చేయలేకపోయింది. కీర్తి సురేష్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రివాల్వర్ రీటా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. అనివార్య కారణాల వల్ల రిలీజ్ డిలే కావడం కూడా కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించింది.
రివాల్వర్ రీటా కథ ఇదే...
డ్రాకులా పాండ్యన్ అనే డాన్ పాండిచ్చేరిని గడగడలాడిస్తుంటాడు. పాండ్యన్‌ను చంపడానికి నర్సింహారెడ్డి ప్రయత్నిస్తుంటాడు. ఓ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంటాడు. అనుకోకుండా రీటా తల్లితో జరిగిన ఓ గొడవలో పాండ్యన్ చనిపోతాడు. ఆ మర్డర్ కేసు నుంచి బయటపడటానికి రీటా ఫ్యామిలీ ఎలాంటి ప్లాన్స్ వేసింది? రీటా కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన బాబీ పాండ్యన్‌తో పాటు మార్టిన్ గ్యాంగ్ ఎవరన్నదే రివాల్వర్ రీటా మూవీ కథ.
రివాల్వర్ రీటా రిజల్ట్‌తో సంబంధం లేకుండా దక్షిణాదిలో హీరోయిన్‌గా బిజీగా ఉంది కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనలో హీరోయిన్‌గా నటిస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. అలాగే మలయాళం , హిందీ భాషల్లో రెండు సినిమాలు అంగీకరించింది కీర్తి సురేష్.
సంబంధిత వార్తలు

Keerthy Suresh | జిమ్‌లో తెగ కష్టపడుతున్న కీర్తి సురేష్ – వర్కవుట్ ఫొటోలు చూశారా!
మే 17, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



