త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | సందీప్ వంగాకు ఫ‌స్ట్ ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం

Tollywood | టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కుమార్ అలియాస్ కేకే బుధ‌వారం క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు స‌మాచారం. నాగార్జున కేడీ మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కిర‌ణ్ కుమార్‌. ప్ర‌స్తుతం కేజీక్యూ అనే సినిమా చేస్తున్నారు.

N

Entertainment | Published On Dec 17, 2025, 3.32 pm IST

Tollywood |  సందీప్ వంగాకు ఫ‌స్ట్ ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం

Kiran Kumar

Advertisement

Tollywood |  తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కుమార్ (Kiran Kumar)అలియాస్ కేకే బుధ‌వారం క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు తెలిసింది. నాగార్జున కేడీ మూవీతో కిర‌ణ్ కుమార్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి (Tollywood) ఎంట్రీ ఇచ్చాడు. యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా 2010లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌మ‌ర్షియ‌ల్‌గా కేడీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. డైరెక్ట‌ర్ సందీప్ వంగాకు టాలీవుడ్‌లో తొలి అవ‌కాశం ఇచ్చింది కిర‌ణ్ కుమార్ కావ‌డం గ‌మ‌నార్హం. కేడీ సినిమాకు కిర‌ణ్ కుమార్‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా సందీప్ వంగా ప‌నిచేశారు.
కేడీ డిజాస్ట‌ర్‌తో డైరెక్ట‌ర్‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో మ‌ణిర‌త్నం వ‌ద్ద చాలా సినిమాల‌కు అసోసియేట్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు కిర‌ణ్ కుమార్‌. ప్ర‌స్తుతం కిర‌ణ్ కుమార్ కేజేక్యూ (కింగ్ జాకీ క్వీన్‌) అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా అనారోగ్యం కార‌ణంగా కొన్నాళ్లు షూటింగ్‌ను ఆపేశారు కిర‌ణ్ కుమార్ . మ‌ళ్లీ కోలుకొని షూటింగ్‌ను తిరిగి మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న టైమ్‌లోనే కిర‌ణ్ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం టాలీవుడ్ వ‌ర్గాల‌ను షాకింగ్‌కు గురిచేసింది.
యాక్ట‌ర్‌గా కేకే ఇటీవ‌లే అరంగేట్రం చేశాడు. విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి మూవీలో సీబీఐ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించాడు. కిర‌ణ్ కుమార్ మృతికి ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement