Trisha | సీఎం కాగానే త్రిష కోసం విజయ్ కొత్త రూల్స్?
త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న కరుప్పు మూవీ మే 14న రిలీజ్ కాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు తమిళనాడులో విజయ్ ప్రభుత్వం స్పెషల్ షోస్‌కు పర్మిషన్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో దళపతి విజయ్ వారసుడు మూవీ నుంచి స్పెషల్ షోస్‌ను డీఎంకే ప్రభుత్వం బ్యాన్ చేసింది.
Entertainment | Published On May 5, 2026, 7.30 pm IST
Trisha | పాలిటిక్స్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టారు దళపతి విజయ్. తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన దళపతి విజయ్ టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. సీఎంగా విజయ్ పదవిని చేపట్టబోతున్నారు.
త్రిష పేరు హైలైట్...
తమిళనాడులో విజయ్‌తో పాటు త్రిష పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దళపతి విజయ్‌తో త్రిష డేటింగ్‌లో ఉందని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లు ఇలా ఉండగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న టైమ్‌లోనే విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష అతడిని కలవడం ఆసక్తికరంగా మారింది.
కరుప్పు స్పెషల్ షోస్...
కాగా త్రిష అప్‌కమింగ్ మూవీ కరుప్పు మే 14న రిలీజ్ కాబోతుంది. సూర్య హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు తమిళనాడులో స్పెషల్ షోస్‌కు విజయ్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉదయం ఐదు గంటల ఆటను ప్రదర్శించే వెసులుబాటు కల్పించబోతున్నట్లు సమాచారం.
విజయ్ వారిసు రిలీజ్ టైమ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ అభిమాని మరణించాడు. అప్పటి నుంచి స్పెషల్ షోస్‌ను డీఎంకే ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఉదయం తొమ్మిది గంటల తర్వాతే సినిమాలను ప్రదర్శించాలంటూ ఆర్డర్స్ జారీ చేసింది.
ట్వీట్స్ వైరల్...
ఈ రూల్స్‌ను త్రిష మూవీతోనే విజయ్ గవర్నమెంట్ ఎత్తివేయబోతున్నట్లు సమాచారం. కరుప్పు మూవీకి తమిళనాడు మొత్తంలో ప్రత్యేక షోలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న కరుప్పులో త్రిష లాయర్ పాత్రలో కనిపించబోతున్నది. దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత సూర్య, త్రిష కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



