Karthi | ఏసీపీ వీరప్పన్‌గా కార్తీ – హిట్ 4పై అప్‌డేట్ – పదేళ్ల తర్వాత తమిళ హీరో తెలుగు మూవీ
కోలీవుడ్ హీరో కార్తీ బర్త్‌డే సందర్భంగా రెండు తెలుగు సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. ఊపిరి అనంతరం పదేళ్ల గ్యాప్ తర్వాత హీరో కార్తీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నాడు. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందుతోన్న హిట్ 4 త్వరలో సెట్స్‌పైకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Entertainment | Published On May 25, 2026, 3.14 pm IST
Karthi | టాలీవుడ్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌గా హిట్ కొనసాగుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథలతో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. హిట్‌లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడివి శేష్, హిట్ 3లో నాని హీరోలుగా నటించాడు. ఈ మూడు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాలను సాధించాయి. ఈ హిట్ ఫ్రాంచైజ్‌లో వచ్చిన సినిమాలన్నింటిని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. శైలేష్ కొలను వీటికి దర్శకత్వం వహించాడు.
హిట్ 4...
తాజాగా ఈ సినిమాలకు కొనసాగింపుగా హిట్ 4 రాబోతుంది. ఈ నాలుగో పార్ట్‌లో కార్తీ హీరోగా నటించబోతున్నాడు. సోమవారం కార్తీ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. . హిట్ 4లో ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ శైలేష్ కొలనుతో కార్తీ దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రోషన్ మేక హీరోగా ఏమో ఏమో ఇది పేరుతో రొమాంటిక్ లవ్‌స్టోరీని రూపొందిస్తున్నారు. శైలేష్ కొలను. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత హిట్ 4ను శైలేష్ కొలను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ...
కోలీవుడ్ హీరో కార్తీ పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అవారా, యుగానికి ఒక్కడుతో పాటు కార్తీ హీరోగా నటించిన పలు తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో పెద్ద హిట్టయ్యాయి. స్ట్రెయిట్ తెలుగులో మాత్రం ఇప్పటివరకు కేవలం ఊపిరి సినిమా మాత్రమే చేశారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వం రూపొందించిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఊపిరి తర్వాత దాదాపు పదేళ్ల లాంగ్ గ్యాప్ అనంతరం కార్తీ తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మీనాక్షి చౌదరి...
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఫొటోలను కార్తీ బర్త్‌డే సందర్భంగా సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం హైదరాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranveer Singh | డాన్-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్వీర్ సింగ్..!
మే 26, 2026

Kajal Aggarwal ట్రెండీ లుక్‌లో మెరిసిన కాజల్ – కొత్త ఫొటోలు చూశారా?
మే 25, 2026

Maa Inti Bangaram Trailer | డైలాగ్ కరెక్ట్‌గా పడితే ఎవడైనా బెదరాల్సిందే …సమంత యాక్షన్ ట్రీట్ – మా ఇంటి బంగారం ట్రైలర్ రిలీజ్
మే 25, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



