త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Action Comedy OTT | ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి కృతిశెట్టి త‌మిళ మూవీ – తెలుగులో రిలీజ్‌

కార్తి, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మూవీ వా వాథియార్ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగులో ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ రిలీజ్ అవుతోంది.

N

Entertainment | Published On Jan 27, 2026, 12.50 pm IST

Action Comedy OTT | ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి కృతిశెట్టి త‌మిళ మూవీ – తెలుగులో రిలీజ్‌
Advertisement

Action Comedy OTT |  థియేట‌ర్ ఓటీటీ రిలీజ్ మ‌ధ్య గ్యాప్ రాను రాను త‌గ్గిపోతుంది. థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన సినిమాలు సైతం నెల రోజులు కాక‌ముందే ఓటీటీలోకి వ‌స్తున్నాయి. అదే ఫెయిలైన సినిమాలు అయితే రెండు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.

ప‌దిహేను రోజుల్లోనే...

తాజాగా త‌మిళ మూవీ వా వాథియార్ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. విడుద‌ల తేదీని  ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ వెల్ల‌డించింది.

కృతి శెట్టి హీరోయిన్‌...

వా వాథియార్ మూవీలో కార్తీ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించారు. యాక్ష‌న్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు న‌ల‌న్ కుమార‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్టూడియో గ్రీన్ ప‌తాకంపై కేఈ జ్ఞాన‌వేళ్ రాజా నిర్మించారు.
థియేట‌ర్ల‌లో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకే సారి ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తెలుగు వెర్ష‌న్‌కు అన్న‌గారు వ‌స్తారు అనే   టైటిల్ ను ఫిక్స్ చేశారు. డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సింది. కానీ ఫైనాన్షియ‌ర్ల‌తో నెల‌కొన్న వివాదం కోర్టు వ‌ర‌కు వెళ్ల‌డంతో సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న కేవ‌లం త‌మిళ వెర్షన్‌ను మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చారు. తెలుగులో రిలీజ్ కాలేదు. తాజాగా తెలుగు వెర్షన్ డైరెక్ట్ గా ఓటీటీ లోకే రాబోతుంది.

డిజాస్ట‌ర్‌...

కోర్టు వివాదాల‌కు తోడు కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో వా వాథియార్ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కార్తీ కెరీర్‌లోనే అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 30 కోట్ల  బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 11 కోట్లలోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాలు తెచ్చిపెట్టింది.
తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాలు మేళ‌వించి ద‌ర్శ‌కుడు న‌ల‌న్ కుమార‌స్వామి ఈ సినిమాను రూపొందించారు. రాము (కార్తి) అవినీతిప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌. అత‌డి తాత (స‌త్య‌రాజ్‌)ఎంజీఆర్ వీరాభిమాని. మ‌న‌వ‌డిని నిజాయితీప‌రుడిగా చూడాల‌ని తాత అనుకుంటాడు. ఎంజీఆర్ ఆత్మ రాములో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అన్న‌దే వా వాథియార్ మూవీ క‌థ‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement