Tamannaah | మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. రెండేళ్ల పాటు ఉత్పత్తులపై ప్రచారం..!
Tamannaah | ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తులకు అంబాసిడర్‌గా హీరోయిన్ తమన్నా భాటియా నియామకమైంది. రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతూ.. ఉత్పత్తులపై ప్రచారం చేయనున్నారు. చాలా రోజుల కిందటే తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
Entertainment | Published On Feb 10, 2026, 9.17 am IST
Tamannaah | ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తులకు అంబాసిడర్‌గా హీరోయిన్ తమన్నా భాటియా నియామకమైంది. రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతూ.. ఉత్పత్తులపై ప్రచారం చేయనున్నారు. చాలా రోజుల కిందటే తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాష్ట్రానికి చెందిన నటిని మాత్రమే మైసూర్ సాండల్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించాలని పలువురు డిమాండ్ చేశారు. అయినా, ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకుండా తమన్నాను అంబాసిడర్‌గా నియమించింది. ఎంతో చరిత్ర కలిగిన మైసూర్ శాండల్ సోప్‌ను సరికొత్త రూపురేఖలు, ఆధునిక బ్రాండింగ్‌తో మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు కర్నాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు.
యువతను లక్ష్యంగా చేసుకుని కేఎస్‌డీఎల్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మరింత బలమైన మార్కెట్‌ను నిర్మించడమే తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నా నియామకంతో ఉత్తర భారత మార్కెట్‌లో మైసూర్ శాండల్ సోప్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు ఈ రెండేళ్ల వ్యవధిలో తమన్నా ఇతర ప్రైవేట్ కంపెనీలకు చెందిన సమాన తరహా ఉత్పత్తులకు ప్రచారం చేయరని స్పష్టం చేశారు. 2030 నాటికి కేఎస్‌డీఎల్ టర్నోవర్‌ను రూ. 5వేల కోట్లకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పాటిల్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో విజయపుర, దాబస్‌పేట పారిశ్రామిక ప్రాంతాల్లో త్వరలోనే కొత్త ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రూ. 25–30 కోట్లుగా ఉన్న ఎగుమతుల టర్నోవర్‌ను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, గత ఏడాది మే నెలలో తమన్నాను రూ.6.2 కోట్ల పారితోషికంతో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వకుండా బయటి నటి ఎంపికపై పలు కన్నడ సంఘాలు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నకిలీ మైసూర్ శాండల్ సోపుల బెడదను సమర్థంగా అరికట్టామని.. దక్షిణ భారతదేశంలో మంచి ఆదరణ పొందుతున్న తమ ఉత్పత్తులను ఢిల్లీతో పాటు మధ్య భారత మార్కెట్లలోనూ విస్తరిస్తున్నామని కేఎస్‌డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ టర్నోవర్ రూ. 2వేల కోట్లకు చేరుకునే అవకాశముందని ఆయన వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






