kannada heroines | అసభ్యకర యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నారు – కన్నడ హీరోయిన్ల ఆగ్రహం
సినిమాల, పబ్లిక్ ఈవెంట్‌లలో హీరోయిన్లను అసభ్యకరంగా ఫొటోలు తీస్తున్నారని కన్నడ నాయికలు ఆరోపిస్తున్నారు. తమ నటనను గుర్తించాల్సిన చోట ః శరీరాలను హైలైట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఇలా ఫొటోలు తీస్తే ఊరుకోమని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
Entertainment | Published On Mar 3, 2026, 7.48 pm IST
kannada heroines | అసభ్యకర ఫొటోలు, పోస్ట్‌లపై కన్నడ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సప్తమి గౌడ, రుక్మిణి వసంత్‌తో పాటు ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సినిమా, పబ్లిక్ ఈవెంట్‌లలో హీరోయిన్ల ఫొటోలను, వీడియోలను అభ్యంతరకర యాంగిల్స్‌లో తీయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారని ఈ పోస్ట్‌లలో హీరోయిన్లు పేర్కొన్నారు. తమ నటనను గురించి చెప్పాల్సిన చోట శరీరాలను జూమ్ చేస్తూ అసభ్యకర ఫోస్ట్‌లు పెడుతున్నారని తెలిపారు.
సహించేది లేదు...
"మేము సినిమాల కోసమే కష్టపడుతున్నాం. ఈ కళ కోసమే పనిచేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా జూమ్ చేస్తూ అసభ్యకరమైన యాంగిల్స్‌లో ఫొటోలు తీయడాన్ని ఖండిస్తున్నాం. ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఈ ఈవెంట్‌లను కవర్ చేసేవాళ్లు తమ వృత్తిని గౌరవించడమే కాకుండా, కనీస సభా మర్యాదను పాటిస్తే బాగుంటుంది. వారి నుంచి మేము కోరుకునేది ఇదే. ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళలంతా ఈ సమస్యలపై గళం విప్పాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న మహిళలకు సంఘీభావంగా నిలబడదాం" అంటూ తమ పోస్టుల్లో ఈ హీరోయిన్లు పేర్కొన్నారు. వారి పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి. పలువురు హీరోయిన్లు వీరికి మద్దతు తెలుపుకున్నారు. వారికి సపోర్ట్‌గా కామెంట్స్ పెడుతోన్నారు.
ప్రస్తుతం రుక్మిణి వసంత్, ఆషికా రంగనాథ్‌తో పాటు సప్తమి గౌడ కన్నడంతో పాటు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. కాంతార సినిమాతో సప్తమి గౌడ, కాంతార ఛాప్టర్ వన్‌తో రుక్మిణి వసంత్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్ కూడా తెలుగులో నా సామి రంగ, భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
సంబంధిత వార్తలు

NTR | ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం.. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్..
మే 20, 2026

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026

Mouni Roy | విడాకుల దిశగా యంగ్ హీరోయిన్ – భర్తను అన్‌ఫాలో చేసిన విశ్వంభర బ్యూటీ
మే 12, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



