Kajal Aggarwal | అంత గ్యాప్ ఎందుకు? – రెమ్యూనరేషన్‌లో వివక్షపై కాజల్ అగర్వాల్ కామెంట్స్
హీరోలు, హీరోయిన్ల రెమ్యూనరేషన్‌లో తేడాలపై కాజల్ అగర్వాల్ సంచలన కామెంట్స్ చేసింది. ఆస్కార్ లెవెల్‌కు ఇండియన్ సినిమా చేరుకున్నా రెమ్యూనరేషన్‌లో గ్యాప్ మాత్రం అలాగే ఉందని అన్నది. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ సినిమానే ఎన్నో రెట్లు బెటర్ అంటూ కాజల్ చెప్పింది.
Entertainment | Published On Jun 8, 2026, 5.00 pm IST
Kajal Aggarwal | అందాల చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తెగ కష్టపడుతోంది. పెళ్లి తర్వాత బొద్దుగా మారిన ఈ బ్యూటీ మళ్లీ స్లిమ్మయ్యింది. హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమాలు చేసేందుకు తాను రెడీ అంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం రామాయణతో పాటు ది ఇండియా స్టోరీ సినిమాలు చేస్తోంది.
రామాయణ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్‌గా జోడీగా రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో అందాల చందమామ కనిపించబోతుంది. ఇండియా స్టోరీలో లాయర్‌గా నటిస్తోంది.
రీఎంట్రీ...
ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తెలుగు రీఎంట్రీని కన్ఫామ్ చేసింది కాజల్. ఇండస్ట్రీలోని వివక్ష, టాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడాలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
వివక్ష ఉంది...
"ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదిగింది. ఆస్కార్ సాధించే స్థాయికి మన సినిమాలు చేరుకున్నాయి. హాలీవుడ్‌కు కంటే ఇండియన్ సినిమాలు ఎందులోనూ తక్కువ కాదని చాలా మంది దర్శకులు నిరూపిస్తున్నారు. వాటితో పాటు ఇండస్ట్రీలో కార్పొరేట్ కల్చర్ కూడా పెరిగింది. అయినా రెమ్యూనరేషన్ విషయంలో హీరోలు, హీరోయిన్ల మధ్య వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్లు చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఈ తేడాలుపై చాలా మంది స్టార్స్ సైలెంట్‌గానే ఉండటం బాధను కలిగిస్తుంది" అని కాజల్ అగర్వాల్ అన్నది.
సౌత్ ఇండస్ట్రీ బెటర్...
సౌత్ ఇండస్ట్రీపై కాజల్ ప్రశంజలు కురిపించింది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగులో తనకు అవకాశాలు వస్తున్నాయని, కథలు, టెక్నీషియన్లతో సినిమాల రీచ్ విషయంలో బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ చాలా బెటర్ అని కాజల్ అన్నది. "ప్రొఫెషనలిజం విషయంలో బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ ఎంతో మెరుగ్గా ఉంది. దక్షిణాదిలో ఎంతో మంది గొప్ప దర్శకులు టెక్నీషియన్లు ఉన్నారు. మంచి కథలతో చెప్పడంలో బాలీవుడ్ కంటే ఎన్నో రెట్లు దక్షిణాది ఇండస్ట్రీ ముందుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఎక్కువే. తెలుగు, తమిళంతో పాటుదక్షిణాది భాషల రీచ్ పెరుగుతోంది. అద్భుతమైన కథాంశాలతో ఇక్కడి సినిమాలు గొప్ప విజయాలను సాధిస్తున్నాయి. నా దృష్టిలో హిందీ కంటే దక్షిణాదినే చాలా బెటర్" అని కాజల్ అన్నది.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు కాజల్ ప్రకటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ – నాగార్జున హీరో – రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ…
ఆగస్టు 4, 2026

Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే – బ్లడీ రోమియోతో రొమాన్స్
ఆగస్టు 4, 2026

Aishwarya Rajesh | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం



