త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gosula Srinivas Yadav | పొంగులేటి.. బలుపు మాటలు బంజేసి నీ శాఖలో జరుగుతున్న భూదందాపై దృష్టి పెట్టు

హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. భూ దందాలు ఆపి శాఖపై ఫోకస్ పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు.

J

Telangana | Published On Aug 20, 2026, 8.58 pm IST

Gosula Srinivas Yadav | పొంగులేటి.. బలుపు మాటలు బంజేసి నీ శాఖలో జరుగుతున్న భూదందాపై దృష్టి పెట్టు
Advertisement
  • తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి హరీశ్ రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ యాదవ్
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పొంగులేటి అక్రమాలకు తెరలేపారని, రెవెన్యూ శాఖలో భూ దందాలు నడుస్తున్నాయని ఆరోపణలు
  • గతంలో 'దీపావళి బాంబులు' పేలుతాయని చెప్పి ప్రజల ముందు అభాసుపాలయ్యారని చురకలు
  • మంత్రి తన తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్

Gosula Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావుపై (Harish Rao) రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గురువారం హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రెవెన్యూ శాఖలో భూ దందాలు

మంత్రి పొంగులేటి బలుపు మాటలు మానుకుని, ముందు తన రెవెన్యూ శాఖలో (Revenue Department) జరుగుతున్న భూ దందాలపై దృష్టి పెట్టాలని గోసుల హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పొంగులేటి అక్రమాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సొంత శాఖను సమర్థవంతంగా నిర్వహించడం చేతగాకనే, దాన్ని కవర్ చేసుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

'ఆ బాంబులు' ఏమయ్యాయి?

తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే పదే పదే కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్ రావులపై విమర్శలు గుప్పిస్తూ పొంగులేటి కాలం వెళ్లదీస్తున్నారని గోసుల ధ్వజమెత్తారు. గతంలో "దీపావళి బాంబులు పేలుతాయి.. రాజకీయ ప్రకంపనలు వస్తాయి" అని భారీ డైలాగులు కొట్టి, తీరా ఏమీ జరగకపోవడంతో ప్రజల ముందు అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు.

ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతాం..

మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని గోసుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పదే పదే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అవాకులు చెవాకులు పేలితే.. రాబోయే రోజుల్లో పబ్లిక్ డొమైన్‌లో (Public Domain) ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Advertisement