త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 300 కి.మీ పాదయాత్ర చేసి ఎర్రవెల్లి చేరుకున్నారు. వారిని కలిసిన కేసీఆర్ ఏం చెప్పారంటే?

J

Telangana | Published On Aug 20, 2026, 8.06 pm IST

KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి
Advertisement
  • కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి నుంచి ఇద్దరు గిరిజన యువకుల పాదయాత్ర
  • 11 రోజుల పాటు 300 కిలోమీటర్లు నడిచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న జాడే తిరుపతి, దుర్గం శంకర్
  • ఎర్రవెల్లిలో వారిని ఆప్యాయంగా పలకరించి, భుజం తట్టి అభినందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • తిరిగి సొంతూరు వెళ్లేందుకు అభిమానులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి

KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR)పై ఉన్న అభిమానాన్ని ఇద్దరు సామాన్యులు వినూత్నంగా చాటుకున్నారు. "తెలంగాణకు మళ్లీ కేసీఆర్ పాలన రావాలి.. ఆయనే మళ్లీ సీఎం కావాలి" అని ఆకాంక్షిస్తూ.. ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వరకు ఏకంగా 300 కిలోమీటర్లు పాదయాత్ర (Padayatra) చేశారు. గురువారం ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసి తమ ప్రేమను, అంకితభావాన్ని వ్యక్తపరిచారు.

11 రోజులు.. 300 కిలోమీటర్లు

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుపతి ఒక ఆటో డ్రైవర్ కాగా, దుర్గం శంకర్ హోటల్ కార్మికుడు. వీరిద్దరూ గిరిజన బిడ్డలు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు. ఎలాంటి స్వార్థం, వినతిపత్రాలు లేకుండా కేవలం తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఈ సుదీర్ఘ యాత్ర చేపట్టారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున 11 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి ఎర్రవెల్లి (Erravelli) చేరుకున్నారు.

Two Tribal Fans Walk 300km to Meet KCR in Erravelli

ఎమ్మెల్యే కోవ లక్ష్మి సపోర్ట్

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో వీరికి గురువారం కేసీఆర్ అపాయింట్‌మెంట్ (Appointment) దొరికింది. ఫామ్‌హౌస్‌లో వీరిని కలిసిన కేసీఆర్.. వారి శ్రమను చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించి, ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

"మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది.."

ఈ సందర్భంగా ఆ ఇద్దరు అభిమానుల భుజం తట్టిన కేసీఆర్.. "మళ్ళా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి" అంటూ భరోసా ఇచ్చారు. వారి నిస్వార్థమైన ప్రేమని, సంకల్పాన్ని అభినందించారు. అనంతరం వారిద్దరూ సొంత ఊరికి తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి మరీ వీడ్కోలు పలికారు.

Two Tribal Fans Walk 300km to Meet KCR in Erravelli

పదవులు, పనుల కోసం నాయకుల చుట్టూ తిరిగే ఈ రోజుల్లో.. కేవలం తమ అభిమాన నాయకుడిపై ప్రేమతో ఒక సాధారణ ఆటో డ్రైవర్, హోటల్ వర్కర్ చేసిన ఈ పాదయాత్ర ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement