త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeffrey Epstein Web Series | జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై వెబ్‌సిరీస్ – రిలీజైన ఆరేళ్ల త‌ర్వాత ట్రెండింగ్‌

ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న‌ట్లుగా రోజుకో సెలిబ్రిటీ పేరు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ వివాదం కార‌ణంగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఓ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది.

N

Entertainment | Published On Feb 8, 2026, 2.52 pm IST

Jeffrey Epstein Web Series |   జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై వెబ్‌సిరీస్ – రిలీజైన ఆరేళ్ల త‌ర్వాత ట్రెండింగ్‌
Advertisement

Jeffrey Epstein Web Series |  జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తోంది. ఎప్‌స్టీన్ లైంగిక కుంభ‌కోణంతో సంబంధం ఉన్న‌ట్లుగా వివిధ దేశాల‌కు చెందిన దిగ్గ‌జ పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌, వ్యాపార‌వేత్త‌ల‌తో పాటు ప‌లువురు సెలిబ్రిటీల‌ పేర్లు వినిపిస్తున్నాయి. బిల్ క్లింట‌న్‌, డోనాల్డ్ ట్రంప్‌, ఎలాన్ మ‌స్క్‌, బిల్ గేట్స్ , సెర్గీ బ్రీన్ తో పాటు చాలా మంది సంపన్నుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం ఇండియాను వ‌ణికిస్తోంది. అనిల్ అంబానీతో పాటు మ‌రికొంద‌రు బిజినెస్‌మెన్స్‌, బాలీవుడ్ లెజెండ్స్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

రోజుకో కొత్త పేరు...

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఇంకా ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అమెరికాకు చెందిన ఈ లైంగిక నేర‌స్తుడితో సంబంధం ఉన్న ప్ర‌ముఖులు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రోజుకో కొత్త పేరు వెలుగులోకి రావ‌డం ఉత్కంఠ‌ను పంచుతోంది. ఎప్‌స్టీన్ కుంభ‌కోణం కార‌ణంగా నిన్న‌టివ‌ర‌కు సెలిబ్రిటీలుగా ఉన్న చాలా మంది జైలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌...

ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం నేప‌థ్యంలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై ఆరేళ్ల క్రితం రిలీజైన నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. మైన‌ర్ బాలిక‌ల అక్ర‌మ ర‌వాణా, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో అమెరికాలోని జైలులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.
అత‌డు చ‌నిపోయిన ఏడాది త‌ర్వాత 2020లో నెట్‌ఫ్లిక్స్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫిఫ్త్ రిచ్ పేరుతో ఓ డాక్యుమెంట‌రీ రిలీజైంది. నాలుగు ఎపిసోడ్స్‌తో రిలీజైన ఈ సిరీస్ ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ టెన్ ట్రెండింగ్ సిరీస్ లిస్ట్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది.

వ్య‌థ‌లు...

ఉపాధ్యాయుడి నుంచి ఫైనాన్షియ‌ర్‌గా ఎప్‌స్టిన్ ప్ర‌యాణం ఎలా సాగింది? లైంగిక నేరాల‌కు ఏ విధంగా పాల్ప‌డ్డాడు? త‌న చీక‌టి సామ్రాజ్య విస్త‌ర‌ణ కోసం అమాయ‌కులైన‌ చిన్నారుల‌కు ఎలా బ‌లిప‌శువుల‌ను చేశాడ‌న్న‌ది వాస్త‌విక కోణంలో ఈ సిరీస్‌లో చూపించారు. ఎప్‌స్టీన్ చేతిలో మోస‌పోయిన బాధితుల వ్య‌థ‌ల‌ను, క‌న్నీటి గాథ‌ల‌ను ఈ సిరీస్‌లో చూపించారు. ప్ర‌ముఖుల‌తో అత‌డికి ఉన్న సంబంధాలు, త‌న‌కున్న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి కేసుల నుంచి ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డాడు? చివ‌ర‌కు జైలులోనే అత‌డు ఆత్మ‌హ‌త్య‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను చూపించారు. 2020లో రిలీజైన టైమ్‌లో ఈ సిరీస్‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎప్‌స్టీన్ ఫైల్స్ వెలుగులోకి రావ‌డంతో ఈ సిరీస్‌కు ఒక్క‌సారిగా వ్యూస్ పెరిగాయి. గ‌త కొద్ది రోజుల్లోనే మిలియ‌న్ల‌కుపైగా ఈ సిరీస్‌కు వ్యూస్ వ‌చ్చాయి.

Advertisement
Advertisement