త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ద‌స‌రా త‌ర్వాత 2 ల‌క్ష‌ల మందితో మార్చ్

Mahesh Kumar Goud | ద‌స‌రా పండుగ త‌ర్వాత 2 ల‌క్ష‌ల మందితో మార్చ్ నిర్వ‌హిస్తామ‌ని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) తెలిపారు. ద‌క్షిణాది రెండు రాష్ట్రాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చెప్పార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 14, 2026, 6.56 pm IST

Mahesh Kumar Goud | ద‌స‌రా త‌ర్వాత 2 ల‌క్ష‌ల మందితో మార్చ్
Advertisement

ద‌క్షిణాదిలో రెండు భారీ బ‌హిరంగ స‌భ‌లు
వాళ్లు లేకుంటే బీజేపీ మొల‌కెత్తేదా..?
ఆర్టీసీ కార్మికుల శ్రేయ‌స్సుకు క‌ట్టుబ‌డి ఉన్నాం
క‌విత మాట్లాడే వాస్త‌వాలు ప్ర‌జ‌లకు అర్థ‌మ‌వుతున్న‌య్
ద‌స‌రాకు నామినేటెడ్ పోస్టులు..!
గాంధీ భ‌వ‌న్‌లో టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్

Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : ద‌స‌రా పండుగ త‌ర్వాత 2 ల‌క్ష‌ల మందితో మార్చ్ నిర్వ‌హిస్తామ‌ని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) తెలిపారు. ద‌క్షిణాది రెండు రాష్ట్రాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చెప్పార‌ని ఆయ‌న పేర్కొన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో బుధ‌వారం మీడియా ప్ర‌తినిధుల‌తో మ‌హేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు.

మహిళా జర్నలిస్టులను అవమానించారని రాహుల్ గాంధీపై చౌకబారు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మ‌రి రాహుల్ గాంధీ ఖర్గేకు షూస్ లేస్ కట్టారు. బీజేపీ మొలకెత్తడానికి వాజ‌పేయి, సుష్మాస్వరాజ్ కారణం. వాళ్ళు లేకుంటే బీజేపీ మొలకెత్తేదా? ప్రజా స్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాల రాస్తాం అంటే ఎట్లా? బీజేపీ లాంటి మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడిన వాళ్లకు మద్దతు ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

15 ఏండ్ల నుండి ఆర్టీసీలో ఎన్నికలు లేవు కాబట్టి నిర్వహించాం. ఓడినా గెలిచినా కార్మికుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నాం. పట్టబద్రుల ఎన్నికల కోసం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నాం. 23న సీఎంతో ఎంసీహెచ్ఆర్డీలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల స‌మావేశం ఉంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌వుతారని చెప్పారు.

ఎర్రవల్లిలో 45 ఎకరాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ జరుగుతుంది. కవిత ఫ్యామిలీ గురించి ఎక్కువగా వాస్తవాలు మాట్లాడుతుంది. కవిత మాట్లాడే వాస్తవాలు అన్ని ప్రజలకు అర్థం అవుతున్న‌య్. ఫామ్ హౌస్‌ల మీద దాడి చేయాలని మా అభిమతం కాదు. నీతిమంతులం అని చెప్పుకుంటున్న వాళ్ల‌ గురించి ప్రజలకు అసలు విషయాలు తెలియాలని ఫామ్ హౌస్ విజిట్ అని తెలిపారు.

సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ చేసిన తప్పిదాలు ఆధారాలతో సహా బయట పడుతున్నాయి. 2029లో ఎన్నిక‌ల్లో కేంద్రంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం ప్రమాదంలో ఉంది. బీజేపీ పాలనలో సామాన్యులకు ఏమి జరగలేదు. సంపన్నులకు మాత్రమే లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు అని పేర్కొన్నారు.

కష్ట పడ్డవారికి న్యాయం జరగాలని కార్పొరేషన్ పదవులు ఆలస్యం అవుతున్నాయి. ద‌స‌రా వ‌ర‌కు ఈ ప‌ద‌వుల ప్ర‌క్రియ పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Advertisement
Advertisement