Samyuktha | ‘రాపో23’లో సంయుక్త.. మళ్లీ పుంజుకునేనా?
Samyuktha | వరుస విజయాలతో టాలీవుడ్లో లక్కీ చార్మ్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంయుక్తకు మరో అవకాశం దక్కింది. యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో23’లో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. రామ్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్లో మరో కీలక మలుపుగా మారనుంది.
Entertainment | Published On Aug 5, 2026, 6.30 pm IST
Samyuktha | వరుస విజయాలతో టాలీవుడ్లో లక్కీ చార్మ్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంయుక్తకు మరో అవకాశం దక్కింది. యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో23’లో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. రామ్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్లో మరో కీలక మలుపుగా మారనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ‘రాపో23’ చిత్రీకరణ కొనసాగుతోంది. ఇందులో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించనున్నాడు. రామ్ సరసన సంయుక్త నటించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉండడంతోనే మల్లు బ్యూటీని ఎంపిక చేసినట్లు సమాచారం. టాలీవుడ్లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే సంయుక్త మంచి గుర్తింపు తెచ్చుకున్నది.
భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. వరుస విజయాలతో ఒక దశలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే, ఇటీవల కాలంలో కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. ‘డెవిల్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోగా.. ‘అఖండ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఆయా సినిమాల్లో సంయుక్త పోషించిన పాత్రలపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇక ‘నారీ నారీ నడుమ మురారి’ విజయం సాధించినప్పటికీ.. ఆమె పాత్రకు పరిమిత ప్రాధాన్యతే దక్కింది. మరోవైపు సంయుక్త నటిస్తున్న కొన్ని చిత్రాలు రిలీజ్లో ఆలస్యమవుతుండటంతో ఆమె కెరీర్పై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రామ్తో కలిసి చేస్తున్న ‘రాపో23’ ఆమెకు కీలక చిత్రంగా మారే అవకాశం ఉంది. ఇక రామ్ పోతినేనికి కూడా ఈ సినిమా ఎంతో కీలకమైందిగా భావిస్తున్నారు.
గత కొంతకాలంగా బలమైన కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న రామ్.. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ‘రాపో23’పై అంచనాలు నెలకొన్నాయి. రామ్–సంయుక్త జోడీపై సినీ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. తెరపై కెమిస్ట్రీ, కథలో బలం ఉంటే ఏ కలయిక అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. మరి ‘రాపో23’తో సంయుక్త మళ్లీ తన క్రేజ్ను అందుకుంటారా? రామ్కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందా? అన్నది సినిమా విడుదల తర్వాతే తేలనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలుగులో స్వయంభు, స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్, ది బ్లాక్ గోల్డ్ మూవీతో మలయాళంలో రామ్, తమిళంలో బెంజ్ చిత్రాల్లో నటిస్తోంది.
సంబంధిత వార్తలు

Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!
ఆగస్టు 5, 2026

Global Summit | ‘తెలంగాణ రైజింగ్-2026’ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు..
ఆగస్టు 5, 2026

Karikaala | ‘కరికాల’గా సందీప్ కిషన్.. కెరీర్లోనే తొలిసారిగా యోధుడి పాత్రలో..!
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Chirumarthy Lingaiah | కాంగ్రెస్ను డస్ట్ బిన్లో వేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నరు
- ●Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!
- ●Mark Zuckerberg Apology | తప్పు మాదే సారీ.. కేంద్ర ప్రభుత్వానికి మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు
- ●Vinayak Damodar Savarkar |ఆవు కూడా..గుర్రం, కుక్క, గాడిద వంటిదే: సావర్కర్
- ●Global Summit | 'తెలంగాణ రైజింగ్-2026' సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు..
- ●MSME | ఎంఎస్ఎంఈలకు గుడ్న్యూస్.. ఆలస్య చెల్లింపులపై కొత్త చట్టం, వివాదాలకు త్వరిత పరిష్కారం..

Chirumarthy Lingaiah | కాంగ్రెస్ను డస్ట్ బిన్లో వేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నరు

Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!

Mark Zuckerberg Apology | తప్పు మాదే సారీ.. కేంద్ర ప్రభుత్వానికి మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు

Vinayak Damodar Savarkar |ఆవు కూడా..గుర్రం, కుక్క, గాడిద వంటిదే: సావర్కర్



