Rasha Thadani | రాషా థడానీకి శుభారంభం దక్కిందా..!
Rasha Thadani | బాలీవుడ్‌లో 1990 దశకంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన రవీనా టాండన్‌కు దక్షిణాది సౌత్ సినిమాలతోనూ అనుబంధం ఉన్నది. ముఖ్యంగా ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాంటి సినీ నేపథ్యం ఉన్న రవీనా కుమార్తె రాషా తడానీ శ్రీనివాస మంగాపురం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఆమె ఆరంభం అందుకుంటుందని సినీ వర్గాలు భావించాయి. అయితే, ఆమె తొలి తెలుగు చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Entertainment | Published On Aug 5, 2026, 7.30 pm IST
Rasha Thadani | బాలీవుడ్‌లో 1990 దశకంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన రవీనా టాండన్‌కు దక్షిణాది సౌత్ సినిమాలతోనూ అనుబంధం ఉన్నది. ముఖ్యంగా ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాంటి సినీ నేపథ్యం ఉన్న రవీనా కుమార్తె రాషా తడానీ శ్రీనివాస మంగాపురం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఆమె ఆరంభం అందుకుంటుందని సినీ వర్గాలు భావించాయి. అయితే, ఆమె తొలి తెలుగు చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘శ్రీనివాస మంగాపురం’తో రాషా తడానీ తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. సినిమా ఫలితం మాత్రమే కాకుండా.. రాషా నటన కూడా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకుముందు రాషా నటించిన తొలి హిందీ చిత్రం నుంచి వచ్చిన ‘ఉయ్ అమ్మ’ సాంగ్ మాత్రం సంచలన విజయాన్ని అందుకుంది. యూట్యూబ్‌లో 500 మిలియన్స్‌కుపైగా వ్యూయర్‌షిప్ సాధించి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ పాటతో వచ్చిన క్రేజ్‌తో తెలుగులోనూ మంచి ప్రారంభం లభిస్తుందని రాషా ఆశించినట్లు తెలుస్తోంది. కానీ ‘శ్రీనివాస మంగాపురం’ ఫలితం అందుకు భిన్నంగా మారింది. సినిమా పరాజయం కావడంతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో రాషా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయలేకపోయింది. దీంతో ఆమె తెలుగు ప్రయాణానికి తొలి అడుగే కొంత నిరాశను మిగిల్చింది. అయితే, ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని రాషా చెబుతోంది. ఈ చిత్రం తన మనసుకు ఎంతో దగ్గరైనదని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
ఇది నిజమైన అనుబంధంతో చేసిన వ్యాఖ్యలేనా? లేక సినిమా ప్రచారంలో భాగంగానా? అన్నది పక్కన పెడితే.. చిత్రంపై ఆమెకున్న నమ్మకాన్ని మాత్రం వెల్లడించింది. ఇక రాషా కెరీర్‌లో మరో ఆసక్తికర అంశం సైతం ఉంది. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం తొలుత రాషా తడానీ పేరును పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. ఒకవేళ ఆ సినిమాలో నటించి ఉంటే, జాన్వీ కపూర్ ఎదుర్కొన్నట్లే నటన విషయంలో విమర్శలు ఎదురయ్యేవా? అన్న చర్చ కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం రాషా తడానీ తన కెరీర్‌ను ఏ దిశగా తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో కొనసాగుతుందా? లేక బాలీవుడ్‌పైనే పూర్తిగా దృష్టి సారిస్తుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే






