Janhvi Kapoor | బాలీవుడ్ నిర్మాతతో జాన్వీ కపూర్ తెగతెంపులు – ఏడేళ్ల బంధానికి వీడ్కోలు
బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్‌కు జాన్వీకపూర్ బిగ్ షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కరణ్ జోహార్‌కు ధర్మ ప్రొడక్షన్స్ నుంచి బయటకు వచ్చిన జాన్వీ తన కెరీర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను మరో సంస్థకు అప్పగించినట్లు సమాచారం.
Entertainment | Published On Jan 29, 2026, 5.26 pm IST
Janhvi Kapoor | బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు జాన్వీకపూర్ పెద్ద షాకిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు హీరోయిన్‌గా లైఫ్ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్‌తో జాన్వీ తెగతెంపులు చేసుకున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ నిర్మించిన ధడక్ మూవీతోనే హీరోయిన్‌గా జాన్వీకపూర్ కెరీర్ మొదలైంది. డెబ్యూ మూవీ నుంచి ఇటీవల రిలీజైన హోమ్‌బౌండ్ వరకు కరణ్ జోహార్ బ్యానర్‌లో చాలానే సినిమాలు చేసింది జాన్వీకపూర్. హోబ్‌బౌండ్ ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీని దక్కించుకుంది. రెండు రౌండ్లు దాటింది. కానీ తుది నామినేషన్స్‌లో మాత్రం ఈ బాలీవుడ్ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.
డేట్స్...రెమ్యూనరేషన్లు...
కాగా డెబ్యూ మూవీ ధడక్ నుండి జాన్వీ కపూర్ డేట్స్, ఆమె కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ చూసుకుంటోంది. కథల సెలెక్షన్, రెమ్యూనరేషన్, బ్రాండ్ ప్రమోషన్స్...ఇలా జాన్వీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ధర్మ ప్రొడక్షన్స్ చక్కబెడుతూ వచ్చింది.
తెలుగులో ఎంట్రీ...
జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వడం వెనుక కూడా కరణ్ జోహార్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ బడా నిర్మాత రికమండేషన్‌తోనే దేవర మూవీతో జాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్లు వార్తలొచ్చాయి. తనను హీరోయిన్‌గా నిలబెట్టిన కరణ్ జోహార్‌కు జాన్వీ బిగ్ షాక్ ఇచ్చిందని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్‌తో తెగతెంపులు చేసుకొని తన కెరీర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్ అనే మరో సంస్థకు అప్పగించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రష్మిక...దీపిక...
కలెక్టివ్ నెట్‌వర్క్ సంస్థ రష్మిక మందన్న, దీపికా పదుకొణే, రణవీర్‌సింగ్, నోరా ఫతేహి తో పాటు మరికొందరు స్టార్స్ డేట్స్‌ను చూస్తోంది. అవకాశాల రేసులో వీరంతా ముందుండటంతోనే జాన్వీ ధర్మా ప్రొడక్షన్స్‌కు గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నెపో కిడ్....
మరోవైపు బాలీవుడ్ జాన్వీ కపూర్‌పై నెపో కిడ్ అంటూ చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. కరణ్ జోహార్ రికమండేషన్స్‌తోనే హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకుంటుందని, లేదంటే జాన్వీకి టాలెంట్ పెద్దగా లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శల నుంచి దూరం కావడానికే జాన్వీ ధర్మా ప్రొడక్షన్స్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగులో పెద్ది మూవీ చేస్తోంది జాన్వీకపూర్. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. దేవర తర్వాత జాన్వీకపూర్ నటిస్తోన్న ఈ తెలుగు సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



