త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన జాన్వీ క‌పూర్‌.. స్పందించిన క‌ర‌ణ్ జోహార్‌..!

Janhvi Kapoor | ప్రముఖ ద‌ర్శ‌క నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ నుంచి జాన్వీ క‌పూర్ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం బాలీవుడ్‌లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పటికే కరణ్ జోహార్ బ్యానర్‌లో పలు సినిమాలు చేసిన జాన్వీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై ఆసక్తి నెలకొంది.

P

Entertainment | Published On Mar 22, 2026, 7.44 pm IST

Janhvi Kapoor | ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన జాన్వీ క‌పూర్‌.. స్పందించిన క‌ర‌ణ్ జోహార్‌..!
Advertisement

Janhvi Kapoor | ప్రముఖ ద‌ర్శ‌క నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ నుంచి జాన్వీ క‌పూర్ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం బాలీవుడ్‌లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పటికే కరణ్ జోహార్ బ్యానర్‌లో పలు సినిమాలు చేసిన జాన్వీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ పరిణామంపై కరణ్ జోహార్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ టాలెంట్ ఏజెన్సీల మధ్య ఇలాంటి మార్పులు సహజమని చెప్పారు. “కొంతమంది టాలెంట్లు మా దగ్గరకు వస్తారు. కొంతకాలం పని చేసి మరో ఏజెన్సీకి వెళ్తారు. మూడు ప్రధాన టాలెంట్ ఏజెన్సీల మధ్య ఇది ‘పాసింగ్ ది పార్సెల్’ ఆటలా కొనసాగుతూ ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు ఉండవని స్పష్టం చేశారు.

ఆయ‌న ఏజెన్సీ గురించి మాట్లాడుతూ.. “మా ఏజెన్సీ ఇండస్ట్రీలో వ్యాపారం చేస్తుంది. అందుకే చాలా మంది కళాకారులు త‌మ వద్దకు వస్తుంటారు. అదే సమయంలో కొంద‌రు కొత్త అవకాశాల కోసం ఇతర ఏజెన్సీలను ఎంచుకోవడం కూడా సహజమే” అన్నారు. జాన్వీ కపూర్ ఏజెన్సీ నుంచి బయటకు వెళ్లడంపై సానుకూలంగానే స్పందించారు. త‌న ఏజెన్సీని వదిలి వెళ్లిన ప్రతి టాలెంట్‌కు శుభాకాంక్షలు చెబుతాన‌ని, వారు ఎక్కడ ఉన్నా మంచి అవకాశాలు ద‌క్కించుకోవాల‌ని కోరుకుంటాన‌ని తెలిపాడు. వారితో క‌లిసి ప‌ని చేయ‌డం ఆప‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో భవిష్యత్తులో జాన్వీ కపూర్‌తో మళ్లీ కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. కరణ్ జోహార్ నిర్మించిన సినిమాల ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. విభిన్న కథలను ఎంచుకుంటూ నటిగా తన ప్రతిభను నిరూపించుకుంటోంది. గ్లామర్ పాత్రలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఏజెన్సీ నుంచి బయటకు వచ్చినప్పటికీ జాన్వీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జాన్వీ చేతిలో ప‌లు భారీ ప్రాజెక్టులున్నాయి. ముఖ్యంగా తెలుగులో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి పెద్ది మూవీలో న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. జాన్వీ ఈ ఏడాది ప‌ర‌మ్ సుంద‌రి, స‌న్నీ సంస్కారీకి తుల‌సీ కుమారి చిత్రాల్లో మెరిసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement