Imax Hyderabad | సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ – హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ థియేటర్ – పార్ట్‌నర్స్‌గా మహేష్‌బాబు, వెంకటేష్
తెలుగు సినీ లవర్స్‌కు ఐమాక్స్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌ను ఐమాక్స్ థియేటర్‌గా రెనోవేట్ చేయబోతున్నారట. ఈ ఐమాక్స్ స్క్రీన్ ప్రాజెక్ట్‌లో ఏషియన్ సునీల్‌తో కలిసి మహేష్‌బాబు, వెంకటేష్, రానా భాగస్వాములుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
Entertainment | Published On May 29, 2026, 7.32 pm IST
Imax Hyderabad | తెలుగు సినీ లవర్స్‌కు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఏషియన్ సినిమా అధినేత సునీల్ నారంగ్ అఫీషియల్‌గా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ థియేటర్ లేకపోవడంపై చాలా కాలంగా సినిమా లవర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ 70 ఎంఎం థియేటర్‌ను ఐమాక్స్ థియేటర్‌గా రెనోవేట్ చేయబోతున్నారట.
భాగస్వాములుగా...
ఈ ఐమాక్స్ థియేటర్ ఏర్పాటులో ఏషియన్ సునీల్‌తో కలిసి టాలీవుడ్ హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు, రానా భాగస్వాములుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ థియేటర్‌పై మరో నాలుగైదు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
34 స్క్రీన్లు
దేశంలో మొత్తం ఇప్పటివరకు 34 ఐమాక్స్ స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ముంబాయిలో 9, ఢిల్లీలో ఎనిమిది ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, పుణాతో పాటు మరికొన్ని నగరాల్లో ఈ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి.
విజువల్ క్లారిటీ....
నార్మల్ స్క్రీన్‌తో పోలిస్తే ఐమాక్స్ స్క్రీన్ చాలా నలభై శాతం వరకు పెద్దగా ఉంటుంది. ఫుల్ స్క్రీన్‌తో సినిమాను చూడొచ్చు. ఇందులో 4కే లేజర్లు రెండింటిని వాడుతారు. దాంతో ప్రతి సీన్ క్రిస్టల్ క్లియర్‌గా ఆడియెన్స్‌కు మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. సౌండ్ విషయంలో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న వారణాసి సినిమాను ఐమాక్స్ వెర్షన్‌లోనే తెరకెక్కిస్తోన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






