CP Sajjanar | నకిలీ వైద్యులతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు..!
CP Sajjanar | వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టి ఇప్పటివరకు 12 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
CP Sajjanar | వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టి ఇప్పటివరకు 12 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేని కొందరు నకిలీ వైద్యులు అసలైన వైద్యుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. అవగాహన లేకుండా రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా కల్తీ ఆహారంపై ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టామని, అదే తరహాలో నకిలీ వైద్యులపైనా నిఘా, చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ఉందో చూడాలి
చికిత్స కోసం క్లినిక్, ఆసుపత్రికి వెళ్లే ముందు అక్కడ జిల్లా వైద్యారోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రిసెప్షన్ వద్ద ప్రముఖంగా ప్రదర్శించారో లేదో పరిశీలించాలని సూచించారు. వైద్యుల బోర్డులపై వారి పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. వైద్యుల అర్హతలపై అనుమానం ఉంటే onlinetsmc.in వెబ్‌సైట్‌లోని ‘Doctor Search’లో వైద్యుడి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వివరాలను నిర్ధారించుకోవచ్చన్నారు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీ వైద్యులుగా భావించి అప్రమత్తం కావాలని సూచించారు. చికిత్స విధానం, సిబ్బంది ప్రవర్తనపై అనుమానం కలిగితే అర్హత కలిగిన మరో వైద్యుడిని సంప్రదించి రెండో అభిప్రాయం తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణిలో ఉన్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కి లేదంటే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతో అమాయకుల ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
- ●Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు
- ●National Law School | సీజేఐపై విద్యార్థుల ఆగ్రహ ఫలితం.. స్నాతకోత్సవాన్ని రద్దు చేసిన నేషనల్ లా స్కూల్
- ●Chiranjeevi | సినిమా ఇండస్ట్రీ కొందరికి కాదు...అందరిదీ - రవితేజ ఇరుముడిపై చిరంజీవి పోస్ట్
- ●Climate Change | హిమాలయాలకు ముప్పు
- ●Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళన అక్కర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు

Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు

National Law School | సీజేఐపై విద్యార్థుల ఆగ్రహ ఫలితం.. స్నాతకోత్సవాన్ని రద్దు చేసిన నేషనల్ లా స్కూల్

Chiranjeevi | సినిమా ఇండస్ట్రీ కొందరికి కాదు...అందరిదీ - రవితేజ ఇరుముడిపై చిరంజీవి పోస్ట్





