త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sinners | నల్ల జాతీయుల వ్యథల‌తో సిన్న‌ర్స్ – నాలుగు ఆస్కార్ అవార్డులు అందుకున్న‌ హార‌ర్ మూవీ

ఆస్కార్ 2026లో హాలీవుడ్ మూవీ సిన్న‌ర్స్ మెరిసింది. ప‌ద‌హారు విభాగాల్లో నామినేట్ అయిన ఈ మూవీ నాలుగు అవార్డుల‌ను గెల‌చుకుంది. బెస్ట్ యాక్ట‌ర్‌తో పాటు ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ఒరిజిన‌ల్ స్కోరు విభాగాల్లో ఆస్కార్ అవార్డుల‌ను అందుకుంది.

N

Entertainment | Published On Mar 16, 2026, 5.22 pm IST

Sinners | నల్ల జాతీయుల వ్యథల‌తో సిన్న‌ర్స్ – నాలుగు ఆస్కార్ అవార్డులు అందుకున్న‌ హార‌ర్ మూవీ
Advertisement

Sinners |  ఆస్కార్ 2026లో వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ అన‌ద‌ర్‌తో పాటు సిన్న‌ర్స్ మూవీకి అవార్డుల పంట ప‌డింది. వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ అన‌ద‌ర్ ఆరు పుర‌స్కారాల‌ను ద‌క్కించుకోగా... సిన్న‌ర్స్ నాలుగు అవార్డుల‌తో స‌త్తా చాటింది. ప‌ద‌హారు విభాగాల్లో పోటీప‌డిన సిన్న‌ర్స్ బెస్ట్ యాక్ట‌ర్‌తో పాటు ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ఒరిజిన‌ల్ స్కోరు విభాగాల్లో ఆస్కార్ అవార్డుల‌ను అందుకుంది.

సిన్న‌ర్స్ క‌థేమిటి?

1930ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా డైరెక్ట‌ర్ ర‌యాన్ కూగ్ల‌ర్ సిన్న‌ర్స్‌ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో మైఖేల్ బీ జోర్డాన్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించాడు. స్మోక్ మరియు స్టాక్ (మైఖేల్ బి. జోర్డాన్) ట్విన్ బ్ర‌ద‌ర్స్‌. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటారు. చికాగోలో అక్ర‌మ మార్గాల ద్వారా డబ్బు సంపాదించి, తమ సొంత ఊరైన క్లార్క్‌డేల్‌కు తిరిగి వస్తారు. అక్కడ ఒక పాత కలప మిల్లు కొంటారు. త‌మ క‌మ్యూనిటీకి చెందిన ప్ర‌జ‌ల కోస‌మే జ్యూక్ జాయింట్ పేరుతో మ్యూజిక‌ల్ బార్‌ను ఏర్పాటుచేశారు. ఆ బార్‌పై వ్యాంపైర్స్‌ దాడిచేస్తాయి? ఆ దాడిని ట్విన్ బ్ర‌ద‌ర్స్ ఎలా ఎదుర్కొన్నారు? ఈ పోరాటం కార‌ణంగా స్మోక్‌, స్టాక్ జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి అన్న‌దే సిన్న‌ర్స్ మూవీ క‌థ‌.

న‌ల్ల జాతీయుల వ్య‌థ‌ల‌తో...

అమెరికాలోని నల్లజాతీయుల చరిత్రను, జానపద కళలు, సంస్కృతితో పాటు వ‌ర్ణ వివ‌క్ష కార‌ణంగా ఎదుర్కొన్న వ్య‌థ‌ల‌ను ద‌ర్శ‌కుడు ర‌యాన్ కూగ్ల‌ర్ ఈ సినిమాలో ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చాలా వ‌ర‌కు ఓ ఇంటి నేప‌థ్యంలోనే సాగుతుంది. ఇందులో హీరోల‌తో పాటు అత‌డి బార్‌లో క‌నిపించేవారంతా న‌ల్ల‌జాతీయులు ఉంటారు. మ‌నుషుల రక్తం తాగే వ్యాంపైర్లుగా తెల్ల‌జాతీయుల‌ను డైరెక్ట‌ర్ చూపించారు. . సమాజంలోని న‌ల్ల జాతీయుల శ్ర‌మ‌ను, వారి క‌ష్టాన్ని దోచుకొని బతికే క్రూరమైన వ్యవస్థకు చెందిన వారిగా తెల్ల జాతీయుల‌ను ఈ సినిమాలో చెప్పారు. ద‌ర్శ‌కుడు. వ్యాంపైర్లు రాత్రిపూట మాత్రమే దాడి అనే అంశం ద్వారా చీకటిలో ప్ర‌పంచానికి తెలియ‌కుండా ఎన్నో అన్యాయాలు జ‌రుగుతుంటాయ‌ని ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించారు.

వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌...

1930 కాలంలో అమెరికాలో వ‌ర్ణ వివ‌క్ష ఏ స్థాయిలో ఉండేదో డైలాగ్స్‌, పాట‌ల ద్వారానే చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు. నల్లజాతీయులు తమ కష్టాలను, బాధలను పాటలుగా మార్చుకొనేవార‌ని చెప్పాడు. సినిమాలో బ్లూస్‌ అనే వాయిద్యం వాయిస్తున్నంత సేపు ఆ సంగీత తాలూకు శ‌క్తి వ్యాంపైర్ల‌ను ద‌గ్గ‌ర‌కు రాకుండా చేస్తుంద‌ని చూపించారు. సంస్కృతిని, మూలాలను విడిచిపెట్ట‌కుండా బ‌త‌కాల‌ని, అప్పుడే త‌మ‌లోని ఐక్య‌త‌ను ఎవ‌రూ దెబ్బ‌తీయ‌లేర‌నే సందేశాన్ని ఇచ్చారు. వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ కార‌ణంగా సంప్ర‌దాయ న‌ల్ల‌జాతీయుల చ‌రిత్ర‌, సంస్కృతి మాత్ర‌మే కాకుండా సంగీతం, సాహిత్యం ఎలా క‌నుమ‌రుగ‌య్యాయ‌న్న‌ది సిన్న‌ర్స్‌లో ద్వారా చెప్పారు డైరెక్ట‌ర్‌.
స్టీఫెన్ కింగ్ రాసిన సేల‌మ్స్ లాట్ న‌వ‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు ర‌యాన్ కూగ్ల‌ర్ సిన్న‌ర్స్ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా రూప‌క‌ల్ప‌న‌లో త‌న కుటుంబం ఎదుర్కొన్న క‌ష్టాలు కూడా స్ఫూర్తినిచ్చాయ‌ని అన్నారు.

 

Advertisement
Advertisement