Disha Patani | హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం.. స్పెషల్ శిక్షణ తీసుకుంటున్న హాట్‌బ్యూటీ దిశా పటానీ..!
Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తొలిసారిగా హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఫిట్‌నెస్, గ్లామర్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇంగ్లిష్ సినిమాల్లోనూ మెరువబోతున్నది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు గ్లోబల్ ప్రాజెక్టుల్లో నటించిన తమదైన ముద్రవేశారు.
Entertainment | Published On May 13, 2026, 9.15 pm IST
Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తొలిసారిగా హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఫిట్‌నెస్, గ్లామర్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇంగ్లిష్ సినిమాల్లోనూ మెరువబోతున్నది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు గ్లోబల్ ప్రాజెక్టుల్లో నటించిన తమదైన ముద్రవేశారు. ఇప్పుడు వారి బాటలోనే దిశా సైతం ముందుకు సాగుతోంది. ‘ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఓ భారీ హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో దిశా కీలక పాత్ర పోషించనుంది. ఇది హాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి సినిమా కావడంతో దిశా కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.
యాక్షన్ అవతార్‌లో..
ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకున్న దిశా.. ఈసారి మాత్రం పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించబోతోందట. మార్షల్ ఆర్ట్స్, ఫిట్‌నెస్‌లో మంచి పట్టు ఉన్న ఆమె, ఈ మూవీ కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోందని సమాచారం. కొన్ని క్లిష్టమైన స్టంట్స్‌ను డూప్ లేకుండానే స్వయంగా చేయడానికి సిద్ధమవుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’, దీపికా పదుకొనే ‘ట్రిపుల్ ఎక్స్’, ఆలియా భట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ వంటి ప్రాజెక్టులతో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దిశా సైతం ఆ జాబితాలో చేరి, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దిశాకు ఉన్న భారీ ఫాలోయింగ్, ఆమె ఫిట్‌నెస్ వీడియోలు, జిమ్నాస్టిక్ నైపుణ్యాలు హాలీవుడ్ మేకర్స్‌ను ఆకట్టుకున్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇంగ్లిష్ మూవీలో కీ రోల్..
ఈ చిత్రంలో ఆమె పాత్ర కేవలం అతిథి పాత్రలా కాకుండా.. కథలో కీలక మలుపులు తీసుకొచ్చే స్థాయిలో ఉంటుందని సమాచారం. ఇండియన్ హీరోయిన్లు సైతం హార్డ్‌కోర్ యాక్షన్ పాత్రల్లో మెప్పించగలరని నిరూపించాలని దిశా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ‘లోఫర్’ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ బ్యూటీ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దిశ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలపై సైతం దృష్టి సారించింది. ఇక ‘ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ షూటింగ్, విడుదల తేదీలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం విజయవంతమైతే మరిన్ని ప్రాజెక్టుల్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



