Movie Collections | 1400 కోట్లతో తీస్తే ఆరు కోట్లు వచ్చాయి… వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ మూవీ ఇదే
వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా హాలీవుడ్ మూవీ డిజెర్ట్ వారియర్ నిలిచింది. దాదాపు 1400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆరు కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. పెట్టిన పెట్టుబడిలో 99 శాతం నష్టాలను మిగిల్చింది.
Entertainment | Published On May 9, 2026, 5.35 pm IST
Movie Collections | సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. చేసిన ప్రతి సినిమాతో హిట్టు అందుకోవడం ఎంత పెద్ద హీరోకు, దర్శకుడికి అయినా సాధ్యం కాదు. స్టార్ హీరోలందరి కెరీర్‌లోనూ ఫ్లాప్‌లు ఉంటాయి. కొన్ని పరాజయాలు మాత్రం నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఇటీవల రిలీజైన ఓ హాలీవుడ్ మూవీ కోసం నిర్మాత పెట్టిన బడ్జెట్‌లో 99 శాతం నష్టపోయాడు. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ సినిమానే డిజెర్ట్ వారియర్. ఈ ఏడాది ఏప్రిల్‌లో డిజెర్ట్ వారియర్ మూవీ రిలీజైంది. సౌదీ అరేబియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా డిజెర్ట్ వారియర్ రికార్డ్ క్రియేట్ చేసింది. సౌదీ అరేబియా సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటిచెప్పాలనే ఆలోచనతో నిర్మాణంలో మేకర్స్ ఎక్కడ రాజీపడలేదు. ఏకంగా 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
హాలీవుడ్ నటులు...
డిజెర్ట్ వారియర్ సినిమాకు రూపర్ వాట్ దర్శకత్వం వహించాడు. హాలీవుడ్ దిగ్గజ యాక్టర్లు ఆంథోనీ మాకీ, బెన్ కింగ్స్‌లే, షార్ట్లో కూప్లే, అయిషా హార్ట్ కీలక పాత్రల్లో నటించారు. అనౌన్స్‌మెంట్‌తోనే డిజెర్ట్ వారియర్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ షూటింగ్ మూడేళ్ల పాటు సాగడం, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో పాటు ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సౌదీ అరేబియా సినిమా లవర్స్ సైతం డిజెర్ట్ వారియర్‌ను పెద్దగా పట్టించుకోలేదు. వారం కాకముందే థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఓవరాల్‌గా ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం ఆరు కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. పెట్టిన పెట్టుబడిలో 99.6 శాతం నిర్మాత నష్టపోయారు. అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాగా డిజెర్ట్ వారియర్ నిలిచింది.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో...
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రూపర్ వాట్ ఈ సినిమాను తెరకెక్కించారు. మహా క్రూరుడైన ఓ చక్రవర్తిని ఎదురించి ఓ యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Disha Patani | హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం.. స్పెషల్ శిక్షణ తీసుకుంటున్న హాట్‌బ్యూటీ దిశా పటానీ..!
మే 13, 2026

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా…
మే 7, 2026

Vijay Deverakonda | హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ – వైల్డ్ కాంబో సెట్
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



