త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger Shroff | బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్​పై కాల్పులు జ‌రిపింది వీరే..

Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff ) కారుపై కాల్పులకు పాల్ప‌డిన నిందితుల ఫొటోలు వెలుగులోకి వ‌చ్చియి. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో ఇద్ద‌రు దుండ‌గులు (Accused Shooters) ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే.

G

Movies | Published On Oct 19, 2026, 9.11 am IST

Tiger Shroff | బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్​పై కాల్పులు జ‌రిపింది వీరే..
Advertisement

Tiger Shroff | త్రినేత్ర న్యూస్‌: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff ) కారుపై కాల్పులకు పాల్ప‌డిన నిందితుల ఫొటోలు వెలుగులోకి వ‌చ్చియి. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో ఇద్ద‌రు దుండ‌గులు (Accused Shooters) ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. సీసీటీవీల్లో రికార్డ‌యిన వీడియోల ఆధారంగా నిందితుల ఫొటోల‌ను పోలీసులు విడుద‌ల చేశారు. ఈ ఫొటోలో ఇద్ద‌రు వ్యక్తులు తెల్లటి షర్టులు ధరించ‌గా, ఒకరు పుమా (Puma) లోగో ఉన్న నల్లటి క్యాప్ పెట్టుకుని కనిపించారు. దీని ఆధారంగా నిందుల‌ను గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, దాడికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంధేరీ రైల్వే స్టేషన్ (Andheri railway station) వద్ద బైక్‌ను వదిలిపెట్టి పారిపోయినట్లు తెలిపారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో అది ముంబైలోనే రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. దీని హిస్టరీని తెలుసుకోవడానికి పోలీసులు రిజిస్ట్రేషన్ వివరాలు, నంబర్ ప్లేట్, ఛాసిస్, ఇంజిన్ నంబర్లను పరిశీలిస్తున్నారు. కాల్పుల అనంతరం నిందితులు ఎటు వెళ్లారనేది తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు.

కాగా, బైక్‌పై వచ్చిన మూడో వ్యక్తి కూడా ఈ ఇద్దరు నిందితులతో కలిసి ఉన్నాడు. ఘటనా స్థలంలోని ఫుటేజీని పరిశీలిస్తే, ఒక వ్యక్తి వరుసగా కాల్పులు జరపడం, రెండో వ్యక్తి కూడా కాల్పులు జరపడానికి ప్రయత్నించడం కనిపించింది. అయితే, రెండో వ్యక్తి ఆయుధం నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయా లేదా అనేది విజువల్స్ ద్వారా స్పష్టంగా తెలియడం లేదు. ఇదే సమయంలో, మూడో వ్యక్తి పారిపోవడానికి వీలుగా మోటార్ సైకిల్‌పై ఎదురుచూస్తున్నట్లు అందులో రికార్డ్ అయింది.

ఈరోజు టైగ‌ర్ ష్రాఫ్‌. త‌ర్వాత ఎవ‌రు?..

టైగ‌ర్ ష్రాఫ్‌పై కాల్పుల నేప‌థ్యంలో నిందుతుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని, బాలీవుడ్‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ (AICWA) డిమాండ్ చేసింది. ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌పై ఇలాంటి దాడులు పున‌రావృత‌మ‌వ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. `ఈరోజు టైగ‌ర్ ష్రాఫ్‌. త‌ర్వాత ఎవ‌రు? ముంబై న‌డిబొడ్డున ఒక సెల‌బ్రిటీకే భ‌ద్ర‌త లేన‌ప్పుడు.. ఒక సాధార‌ణ వ్య‌క్తి ఎలా సుర‌క్షితంగా బ‌తుకుతాడు. ముంబై విధులు మ‌రోసారి ర‌క్తంతో త‌డిపోతున్నాయి. ఈ ప‌రిస్థితి 1990ల నాటి అండ‌ర్‌వ‌ర‌ల్డ్ యుగాన్ని గుర్తుచేస్తున్న‌ది. భ‌యం నీడ‌లో బాలీవుడ్ ప‌నిచేయ‌లేదు. కాల్పులు జ‌రిపిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసికోండి` అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Advertisement
Advertisement