త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Conjoined Twins | ఒకే శ‌రీరం.. రెండు త‌ల‌ల‌తో జ‌న్మించిన బాలుడు.. శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో వారం రోజులు పోరాడి..

Conjoined Twin | ఒడిశాలోని (Odisha) బెర్హంపూర్‌లో ఒకే శ‌రీరం, రెండు త‌ల‌ల‌తో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు (Conjoined Twin) మ‌ర‌ణించారు. శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో (Respiratory Problems) బాధ‌ప‌డుతున్న చిన్నారులు వారం రోజుల‌పాటు మృత్యువుతో పోరాడి శ‌నివారం తుదిశ్వాస విడిచారు.

G

National | Published On Oct 19, 2026, 7.16 am IST

Conjoined Twins | ఒకే శ‌రీరం.. రెండు త‌ల‌ల‌తో జ‌న్మించిన బాలుడు.. శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో వారం రోజులు పోరాడి..
Advertisement

Conjoined Twin | త్రినేత్ర న్యూస్‌: ఒడిశాలోని (Odisha) బెర్హంపూర్‌లో ఒకే శ‌రీరం, రెండు త‌ల‌ల‌తో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు (Conjoined Twins) మ‌ర‌ణించారు. శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో (Respiratory Problems) బాధ‌ప‌డుతున్న చిన్నారులు వారం రోజుల‌పాటు మృత్యువుతో పోరాడి శ‌నివారం తుదిశ్వాస విడిచారు. ఈ నెల 12న (సోమ‌వారం సాయంత్రం) కంద‌మాల్ జిల్లాలోని తుముడిబంధ్‌కు చెందిన ఓ మ‌హిళ బ‌రంపురంలోని ఎంకేసీజీ (MKCG) వైద్య క‌ళాశాల‌, ద‌వాఖాన‌లో అవిభ‌క్త క‌వ‌ల‌లు జ‌న్మించారు. రెండు త‌ల‌లు, రెండు వెన్నెముక‌లు వేర్వేరుగా ఉన్న‌ప్ప‌టికీ ఒకే శ‌రీరం, గుండె, కాలేయం, ఒకే జ‌న‌నేంద్రియం ఉంది.

'డైసెఫాలిక్ పారాపగస్' (Dicephalic Parapagus) అనే అరుదైన ఆరోగ్య సమస్యతో జన్మించిన ఆ చిన్నారి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో స్పెషల్​ న్యూబోర్న్ కేర్ యూనిట్​లో (SNCU) చికిత్స అందించారు. అయితే శిశువుకు మ‌ల ద్వారం లేక‌పోవ‌డం, శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతూ మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ఆదివారం వెల్ల‌డించారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఇలాంటి శిశువు జన్మించడంతో తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, శిశువు మరణించిన తర్వాత మొదట మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా వారు నిరాకరించారని చెప్పారు. అయితే గంజాం జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, దంపతులకు నచ్చజెప్పిన తర్వాత శనివారం రాత్రి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని వారి సొంత గ్రామానికి తరలించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ సుదీప దాష్ తెలిపారు.

శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో పుట్టినప్పటి నుంని ఎస్ఎన్‌సీయూలో ఉంచి చికిత్స అందించామ‌ని చెప్పారు. `శిశువు సంక్లిష్ట ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ప్రాణాలు కాపాడటానికి శస్త్రచికిత్స (surgery) చేయడానికి ప్రయత్నించాం. కానీ, పుట్టిన మరుసటి రోజు నుంచే శిశువుకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో అది సాధ్యం కాలేద‌న్నారు. పీడియాట్రీషియన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కవలలు ఒక వారం రోజులు మాత్రమే జీవించగలిగారని ఆయన చెప్పారు.

జన్మించినప్పుడు ఆ మగ శిశువు బరువు 2.25 కిలోలు ఉంది. రెండు తలలు, రెండు మెడలు, రెండు వెన్నెముకలు ఉన్నప్పటికీ.. ఒకే ధడం, ఒకే జత చేతులు మరియు కాళ్లు ఉన్నాయి. లోపలి భాగంలో ఒకే గుండె, ఒకే కాలేయం (liver) ఉన్నాయి. అలాగే ఒకే మూత్ర విసర్జక అవయవం (genitourinary tract) కలిగి ఉండి, మలద్వారం లేకుండా జన్మించినట్లు వైద్యులు వెల్లడించారు. రెండు తలలు ఉండి ఒకే శరీరాన్ని పంచుకునే ఇటువంటి అరుదైన స్థితిని 'డైసెఫాలిక్ పారాపగస్' అంటారు. ఇలాంటి కేసులు సుమారు ప్రతి 3 లక్షల ప్రసవాలలో ఒకరికి మాత్రమే సంభవిస్తాయని, ఇలాంటి వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement